మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకలు హైద‌రాబాద్- నాంప‌ల్లిలోని బీజేపీ తెలంగాణ‌ రాష్ట్ర కార్యాలయంలో నిర్వ‌హించారు. వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు  ​బీజేపీ నేత‌లు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్, బీజేపీ నేత‌లు రాజాసింగ్, విజ‌య‌శాంతి త‌దిత‌రులు పాల్గొన్నారు.  

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకలు హైద‌రాబాద్- నాంప‌ల్లిలోని బీజేపీ తెలంగాణ‌ రాష్ట్ర కార్యాలయంలో నిర్వ‌హించారు. వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు ​బీజేపీ నేత‌లు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్, బీజేపీ నేత‌లు రాజాసింగ్, విజ‌య‌శాంతి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీను మంత్రి కేటీఆర్ తెలంగాణ కు ఆహ్వానించ‌నున్నారు. ఈ ఆంశంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల ఆధార్య దేవ‌త‌లైన‌.. దుర్గమాత‌, సీతారామచంద్రుడుల‌ను మూర్ఖుడు స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ అవమానించిన విష‌యం తెలిసి.. ఎలా అత‌డిని మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి ఆహ్వానించడం దారుణమని ఆగ్రహించారు. 

Read Also: Budget 2020:పోఖ్రాన్ ఆంక్షల మధ్య: ఇళ్లు, పరిశ్రమలకు రాయితీలు...

మంత్రి కేటీఆర్ ఓ మూర్ఖుడ‌నీ, రాష్ట్రాన్ని పాలిస్తున్న‌ భయంకరమైన హిందువుగా చెప్పుకునే కేసీఆర్ తొలుత నాస్తికుడైన కొడుకు కేటీఆర్ ను కట్టడి చేయాలని సూచించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వార్థంతో యాగాలు చేస్తుండొచ్చు. కానీ ఆయ‌న కేబినెట్ లో ఉన్న మంత్రులంతా నాస్తికులేనని.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అందుకే తెలంగాణలో హిందూ దేవుళ్ల‌కి అవ‌మానం జ‌రుగుతున్నా... హిందువుల మ‌నోభావాల‌కు ప‌రిర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని అన్నారు. ఇటువంటి చ‌ర్య‌ల‌ను ఎట్టి ప‌రిస్థితిలో ప్ర‌జ‌లు స‌హించకుంద‌ని అన్నారు. కాబ‌ట్టి ద‌య‌చేసి మిత్రులారా ఓ మంచి ఆలోచ‌న‌తో ముందుకు వెళ్దామ‌నీ, శ‌క్తిమంత‌మైన‌, ప్ర‌జాస్వామ్య విలువ‌లు ఉన్నరాష్ట్రంగా తెలంగాణ‌గా తీర్చిదిద్దుకుందామని అన్నారు. మునావర్ ఫారూఖీ లాంటి ముర్ఖులు రాష్ట్రంలో అడుగుపెట్టాడానికి అర్హ‌త లేదని… యువ మోర్చా నేతలు అలాంటి మూర్ఖుడు తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 

Read Also:  Assembly Election 2022: ఉత్త‌రాఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ లో కలవరం.. పార్టీలో మార్పులు చేయాలంటున్న మాజీ సీఎం!

వాజ్ పేయి స్పూర్తితో శక్తివంతమైన తెలంగాణను నిర్మించాల్సిన బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్తపైనా ఉందన్నారు. ఒకప్పుడు విదేశీ ప్రతినిధులకు తాజ్ మహల్ గిఫ్ట్ గా ఇచ్చేవారు. కానీ నేడు విదేశీ ప్రతినిధులకు భగవద్గీత, శ్రీరాముడి ప్రతిమలను అందిస్తూ ప్ర‌ధాని మోడీ నూత‌న ఒర‌వ‌డికి శ్రీ‌కారం చూట్టార‌ని కొనియాడారు.

అనంత‌రం .. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. ఐటీ మినిస్ట‌ర్ కేటీఆర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్టాండ అప్ కమెడియన్ Munawar Farooqiని తెలంగాణ‌కు ఆహ్వానించ‌డాన్ని త‌ప్పు బ‌ట్టారు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న మునావర్ ఫారూఖీని 16 రాష్ట్రాలు వెలివేశాయని.. ఆయనను మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కు ఆహ్వానించ‌డ‌మేమిటని ప్ర‌శ్నించారు. హైదరాబాద్ వేదికగా జనవరి 9న జరగబోయే ఫారూఖీ కార్యక్రమాన్ని అడ్డుకుని తీరతామని, అత‌న్నితరిమికొడతామని రాజాసింగ్ స్పష్టం చేశారు.

Read Also: Atal Bihari Vajpayee జయంతి.. ప్రముఖుల నివాళులు... సేవల్ని స్మరించుకున్న నేతలు

సీఎం కేసీఆర్ హిందూ దేవాలయాలను నిర్మిస్తారని.. అలాగే పూజిస్తారన్నారు. ఒక్కసారి ఫారూఖీని హైదరాబాద్ కు ఆహ్వానించే ముందు కేటీజఆర్ తన తండ్రి కేసీఆర్ ముఖమైనా చూడాల్సిందన్నారు. మునావర్ ఫారూఖీ హిందువుల దేవుళ్లపై కామెడీ చేయడాన్ని కేటీఆర్ సమర్తిస్తున్నారా? అంటూ రాజాసింగ్ ఘాటుగా ప్రశ్నించారు.