MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • KTR : బిఆర్ఎస్ శ్రేణులకు షాక్ ఇచ్చిన కేటీఆర్.. ఇక ఫ్యామిలీకే పరిమితం, పార్టీలకు దూరం

KTR : బిఆర్ఎస్ శ్రేణులకు షాక్ ఇచ్చిన కేటీఆర్.. ఇక ఫ్యామిలీకే పరిమితం, పార్టీలకు దూరం

KTR Birthday : రేపు (శుక్రవారం) భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) 50వ భర్త్ డే. జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఈ రోజు ఆయన వేడుకలకు దూరం కానున్నారు. ఎందుకో తెలుసా?

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 23 2026, 01:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పుట్టినరోజు వేడుకలకు దూరంగా కేటీఆర్
Image Credit : X/BRS

పుట్టినరోజు వేడుకలకు దూరంగా కేటీఆర్

KTR Birthday : భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) శకం ముగిసినట్లే. అధికారాన్ని కోల్పోయాక ఆయన యాక్టివ్ రాజకీయాలు దూరంగా ఉంటున్నారు... ఆయన తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నీతానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఆయ్యేది కేటీఆర్ అనే ప్రచారం ఉంది... అందుకే ఆయనే తమ అధినాయకుడిగా బిఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేటీఆర్ 50వ పుట్టినరోజు వస్తోంది... దీంతో ఈసారి గట్టిగానే సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ ప్లెక్సీలు, హోర్డింగ్స్, కటౌట్స్ ఏర్పాటు, కేక్ కటింగ్, బ్యాండ్ బాజాలతో వేడుకలకు సిద్దమయ్యారు. ఇలా ఘనంగా కేటీఆర్ భర్త్ డే వేడుకలకు సిద్దమైన బిఆర్ఎస్ శ్రేణులకు షాక్ తగిలింది. ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భర్త్ డే సెలబ్రేషన్స్ కు కేటీఆర్ ఎందుకు దూరం అవుతున్నారు?
Image Credit : X/BRS

భర్త్ డే సెలబ్రేషన్స్ కు కేటీఆర్ ఎందుకు దూరం అవుతున్నారు?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఎంట్రెన్స్ కోసం నిర్వహించే NEET క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం దుమారం రేపింది. దేశ రాజధాని డిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఛలో పార్లమెంట్, కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ నివాసం ముట్టడి ఈ ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఆందోళన చేపడుతున్న విద్యార్థులపై పోలీసుల దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలా విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగానే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నారు.

విద్యార్థుల కోసమే కాదు రైతాంగం కోసం కూడా కేటీఆర్ తన భర్త్ డే వేడుకలకు దూరం అవుతున్నారు. ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో సకాలంలో వర్షాలు కురవక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు... రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా గంభీరమైన వాతావరణం నెలకొంది. రైతులు వర్షాల కోసం ఆకాశంవైపు ఎదురుచూసే పరిస్థితి వస్తోంది. ఇలా రైతుల బాధలో ఉండగా తాను పుట్టినరోజు వేడుకలు జరపుకోవడం భావ్యం కాదని కేటీఆర్ భావించారు... అందుకే తన 50వ భర్త్ డే సెలబ్రేట్ చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

35
బిఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Image Credit : X/BRS

బిఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు

జూలై 24 (శుక్రవారం) కేటీఆర్ 50వ భర్త్ డే. ఇది ఆయన జీవితంలో చాలా ప్రత్యేకం. అందుకే బిఆర్ఎస్ శ్రేణులు గట్టిగానే వేడుకలకు ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి వేడుకలు వద్దని కేటీఆర్ సూచించారు. అయితే పార్టీ శ్రేణులను పూర్తిగా డిజప్పాయింట్ చేయకుండా భర్త్ డే వేడుకలు ఎలా జరపాలో కూడా కేటీఆర్ సూచించారు.

తన భర్త్ డే జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు కేక్ కటింగ్‌లు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, పూల బొకేలు, పత్రికా ప్రకటనలు వంటి వాటిపై అనవసరంగా ఖర్చు చేయవద్దని పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆ ఖర్చులను సేవా కార్యక్రమాలకు వినియోగించాలని... ఆపదలో ఉన్నవారికి, అవసరమైన వారికి సాయం అందేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారానే తన జన్మదినాన్ని అర్థవంతంగా నిర్వహించాలని కేటీఆర్ కోరారు.

45
కేటీఆర్ పుట్టినరోజున బిఆర్ఎస్ నిరసన
Image Credit : X/BRS

కేటీఆర్ పుట్టినరోజున బిఆర్ఎస్ నిరసన

ఢిల్లీలో విద్యార్థి, యువతపైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అణిచివేతకు, దాష్టికానికి వ్యతిరేకంగా రేపు (జూలై 24, శుక్రవారం) బిఆర్ఎస్ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కులో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా బిఆర్ఎస్వి చేపట్టే ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ హాజరు కానున్నారు. ఇలా 50వ పుట్టినరోజున కేటీఆర్ ఆందోళన కార్యక్రమంలో పాల్గొననున్నారు.

55
కుటుంబంతోనే కేటీఆర్ భర్త్ డే సెలబ్రేషన్స్
Image Credit : X/BRS

కుటుంబంతోనే కేటీఆర్ భర్త్ డే సెలబ్రేషన్స్

50వ పుట్టినరోజు అంటే ఎవరి జీవితంలో అయినా చాలా ప్రత్యేకం. కేటీఆర్ విషయంలోనే అంతే. కానీ ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు, రైతుల కష్టాల నేపథ్యంలో ఆయన ఘనంగా వేడుకలు జరుపుకునేందుకు విముఖత చూపిస్తున్నారు. అయితే కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి ఆయన సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారు. తన తల్లిదండ్రుల కేసీఆర్-శోభ ఆశీర్వాదం తీసుకుని, భార్యాపిల్లల సమక్షంలో కేక్ కట్ చేయనున్నారు. ఇలా ఇంట్లోనే చిన్నగా భర్త్ డే సెలబ్రేషన్ జరుపుకుంటారని కేటీఆర్ సన్నిహితులు చెబుతున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత రాష్ట్ర సమితి
కల్వకుంట్ల కవిత
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
KTR: చాలా ఏళ్ల త‌ర్వాత ఈరోజు థియేటర్‌కి వెళ్తున్నా.. వైర‌ల్ అవుతోన్న కేటీఆర్ ట్వీట్
Recommended image2
IMD Weather Update : ఈ ప్రాంతాల్లో 200-300 మి.మీ వర్షపాతమా..! ప్రమాద హెచ్చరికలు జారీచేసే స్థాయిలో వానలే..!
Recommended image3
Revanth Reddy : రేవంత్ రెడ్డికి కేరళ అవార్డు.. ఎవరీ ఆర్యదాన్ ముహమ్మద్?
Related Stories
Recommended image1
Now Playing
😂🤣 KTR Shares Funny Incident : మెడపై కత్తిపెట్టి నాది పులివెందుల అన్నాడు | Asianet News Telugu
Recommended image2
Now Playing
నేను సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు హార్డ్‌వేర్ కూడా.. రేవంత్ రెడ్డి KTR స్ట్రాంగ్ కౌంటర్ | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved