Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లేందుకు బీజేపీ నేతల యత్నం: బండి సంజయ్ సహా పలువురి అరెస్ట్

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ శుక్రవారం నాడు బీజేపీ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన  తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Bjp Chalo assembly:Telangana Bjp president Bandi sanjay arrested
Author
Hyde Park, First Published Sep 11, 2020, 11:23 AM IST

హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ శుక్రవారం నాడు బీజేపీ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన  తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఇవాళ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. దీంతో పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు.

ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ రెండో గేటు నుండి అసెంబ్లీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ను  కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.

అధికారంలోకి రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన డిమాండ్ ను బీజేపీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీజేపీ నేతలను ముందస్తుగానే హౌస్ అరెస్టులు చేశారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బండి సంజయ్ రెండు రోజుల పాటు పర్యటించారు. తెలంగాణ విమోచన దినోోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రజలను చైతన్యం చేయడానికి సంజయ్ ప్రయత్నించిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios