Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు బైపోల్ 2022: రెండో రౌండ్ లో టీఆర్ఎస్ కి షాక్, 789 ఓట్ల ఆధిక్యంలో కోమటిరెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ లో రెండో రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన  సమీప టీఆర్ఎస్ అభ్యర్ధిపై 789 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.

BJP Candidate  Komatireddy Rajagopal  Reddy  Leads 789 votes In Second Round
Author
First Published Nov 6, 2022, 9:27 AM IST

మునుగోడు :మునుగోడు  అసెంబ్లీ ఉపఎన్నిక కౌంటింగ్ లో రెండో రౌండ్ లో  బీజేపీ  అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 789 ఓట్ల  ఆదిక్యంలో నిలిచారు. రెండో రౌండ్ లో టీఆర్ఎస్ కి 7,781 ఓట్లు, బీజేపీకి 8,622 ఓట్లు వచ్చాయి.

మునుగోడు అసెంబ్లీ  ఉప  ఎన్నిక కౌంటింగ్ ను ఇవాళ నిర్వహిస్తున్నారు.ఈ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో  చౌటుప్పల్ మండలం ఓట్ల ను  లెక్కిస్తున్నారు. చౌటుప్పల్ మండలానికి అన్ని  పోలింగ్ స్టేషన్లలోని  ఓట్లను 1 నుండి 4 రౌండ్లలో లెక్కించనున్నారు. చౌటుప్పల్  పట్టణంతో పాటు రూరల్ మండలంపై  బీజేపీ ఆశలు  పెట్టుకుంది. అయితే  ఫస్ట్  రౌండ్ లో బీజేపీ  కంటే  టీఆర్ఎస్  ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ రౌండ్ లో బీజేపీ టీఆర్ఎస్ పై పైచేయి సాధించింది.రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి  బీజేపీపై టీఆర్ఎస్ 515 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.రెండు రౌండ్లు కలుపుకుంటే టీఆర్ఎస్అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 14,211ఓట్లు ,బీజేపీ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డికి 13,648 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి 3,597 ఓట్లు వచ్చాయి.

also read:మునుగోడు బైపోల్ 2022:మొదటి రౌండ్ కోమటిరెడ్డిపై కూసుకుంట్ల 1352 ఓట్ల ఆధిక్యం

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios