మునుగోడు బైపోల్ 2022:మొదటి రౌండ్ కోమటిరెడ్డిపై కూసుకుంట్ల 1352 ఓట్ల ఆధిక్యం

మునుగోడు  అసెంబ్లీ  ఓట్ల  లెక్కింపులో భాగంగా ఫష్ట్ రౌండ్  లో టీఆర్ఎస్  అభ్యర్ధి కూసుకుంట్ల  ప్రభాకర్ రెడ్డి 1352  ఓట్ల ఆధిక్యం సాధించారు.

TRS Candidate  Kusukuntla Prabhakar Reddy  Leads 1192 votes In First  Round

మునుగోడు:మునుగోడు  అసెంబ్లీ ఉపఎన్నిక  కౌంటింగ్ లో మొదటి రౌండ్ లో  టీఆర్ఎస్  అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  తన సమీప బీజేపీ  అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి పై 1352 ఓట్ల  ఆదిక్యంలో నిలిచారు. 

తొలి  రౌండ్ లో  టీఆర్ఎస్ కి  6,478 ఓట్లు  రాగా,  బీజేపీకి 5,126 ఓట్లు, కాంగ్రెస్ కి 2,100 ఓట్లు లభించాయి.

మునుగోడు అసెంబ్లీ  ఉప  ఎన్నిక కౌంటింగ్ ను ఇవాళ నిర్వహిస్తున్నారు.ఈ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో  చౌటుప్పల్ మండలం ఓట్ల ను  లెక్కిస్తున్నారు. చౌటుప్పల్ మండలానికిఅన్ని  పోలింగ్ స్టేషన్లలోని  ఓట్లను 1 నుండి 4 రౌండ్లలో లెక్కించనున్నారు. చౌటుప్పల్  పట్టణంతో పాటు రూరల్ మండలంపై  బీజేపీ ఆశలు  పెట్టుకుంది. అయితే  ఫస్ట్  రౌండ్ లో బీజేపీ  కంటే  టీఆర్ఎస్  ఆధిక్యంలో నిలిచింది.

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు.  మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios