లాలూ యాదవ్ కు శిక్షను స్వాగతిస్తున్నాం

లాలూ యాదవ్ కు శిక్షను స్వాగతిస్తున్నాం

మాజీ కేంద్ర మంత్రి.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కు శిక్ష పడడాని స్వాగతిస్తున్నామని బిజెపి నేత మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. ఆయన ఇంకా ఏమన్నారో చదవండి.

కాంగ్రెస్ పార్టీ అవినీతిమయమైన పార్టీ. 2జి కేసులో సీబీఐ సాంకేతిక పరమైన ఆధారాలు చూపించలేకపోయింది. ప్రభుత్వం సాంకేతిక ఆధారాలతో కేసు ను ముందుకు తీసుకుపోవలని ప్రయత్నం చేస్తోంది.  కాంగ్రెస్ పార్టీ సీబీఐ ని రాజకీయ అస్త్రంగా వాడుకుంది. మా ప్రభుత్వం అలాంటి అనైతిక చర్యలకు పాల్పడదు.

ఇండియన్ సైన్సు కాంగ్రెస్ సదస్సును ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియాలో జరపకుండా ఆదేశాలు జారిచేయడం వల్ల తెలంగాణ అంతర్జాతీయ సదస్సు నిర్వహించే అవకాశాన్ని కోల్పోయింది.  ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత. చేతగాని తనం భయటపెట్టింది. ఎవరో అడ్డుకుంటారని చేతులెత్తేయడం సరికాదు.  విభజన తరువాత రాష్ట్రంలో ఉన్న ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మరోసారి పునరలోచించి సైన్సు కాంగ్రెస్ నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలి.

ఉస్మానియాపై ముఖ్యమంత్రికి అయిష్టత ఉంది. అందుకే అక్కడ కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు ముఖ్యమంత్రి ఉస్మానియా విద్యార్థులను చూసి పారిపోతున్నారు. ఈ ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడైతే టిఆర్ఎస్ ప్రభుత్వానికి బీజాలు పడ్డాయో అక్కడ నుంచే టిఆర్ఎస్ పతనం ప్రారంభమవుతుంది.  

ఏఐసీసీ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు ఇంకా అపరి పక్వంగానే ఉన్నాయి.  రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ రాబోవు రోజుల్లో మరింత బలహీన పడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్ట్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పొశించడంలో పూర్తిగా విఫలమైంది.  హైదరాబాద్ లో శాంతి భద్రతల ఆందోళనలు లోపిస్తున్నాయి. ఇటీవల సంధ్యారాణి పై దాడి నన్ను కలిచివేసింది.  మహిళల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page