గుడ్ న్యూస్: తెలంగాణ నుండి అయోధ్యకు ఈ నెల 29 నుండి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన బీజేపీ

అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం బీజేపీ ప్రత్యేక అవకాశం కల్పించింది.  ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.  

 BJP arranges free train from Telangana to Ayodhya  lns

హైదరాబాద్: ఈ నెల  29వ తేదీ నుండి  భారతీయ జనతా పార్టీ  ఆధ్వర్యంలో భక్తులను అయోధ్యకు  తరలించనున్నారు. ఈ మేరకు  భక్తులకు  ప్రత్యేక రైళ్లను ఏర్పాటు  చేశారు.  ఈ నెల  29 నుండి ఫిబ్రవరి  15 వరకు ప్రత్యేక రైళ్లను బీజేపీ ఏర్పాటు చేసింది.

ఈ నెల  29న సికింద్రాబాద్, 30న వరంగల్, 31న హైద్రాబాద్,  ఫిబ్రవరి  1న కరీంనగర్, 2న మల్కాజిగిరి, 3న ఖమ్మం, 5న చేవేళ్ల,6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న ఆదిలాబాద్, 9న మహబూబ్ నగర్, 10న మహబూబాబాద్, 11న మెదక్, 12న భువనగిరి, 13న నాగర్ కర్నూల్,  14న నల్గొండ, 15న జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన  భక్తులను తీసుకెళ్లనున్నారు.ప్రతి ప్రత్యేక రైలులో 20 బోగీలు ఏర్పాటు చేశారు. ప్రతి బోగికి బీజేపీ ఇంచార్జీని నియమించింది బీజేపీ. ప్రతి రైలులో కనీసం  1400 మంది  అయోధ్యకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. 

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం ఈ నెల  22న జరిగింది.  రామ మందిరంలో  రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట నిర్ణీత ముహుర్తం సమయానికి పూర్తైంది.ఈ మహాత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు  దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఏడు వేల మందికి  నిర్వాహకులు ఆహ్వానాలు పంపారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్న సిబ్బందిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పూలు చల్లారు.

also read:అయోధ్యలో రామ మందిరం: భారత జవాన్లతో కలిసి జై శ్రీరామ్ అంటూ చైనా ఆర్మీ నినాదాలు, వీడియో వైరల్

అయోధ్యలో  రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉపవాస దీక్షను విరమించారు.  500 ఏళ్ల కల సాకారమైందని  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.  ఏ స్థలంలో  రాముడి విగ్రహం ఏర్పాటు చేయాలని భావించామో  అక్కడే ఏర్పాటు చేసుకున్నామని ఆయన  చెప్పారు.  500 ఏళ్లుగా  రామ మందిర నిర్మాణం ఎందుకు జరగలేదో ఆలోచించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios