Asianet News TeluguAsianet News Telugu

అయోధ్యలో రామ మందిరం: భారత జవాన్లతో కలిసి జై శ్రీరామ్ అంటూ చైనా ఆర్మీ నినాదాలు, వీడియో వైరల్

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరిగిన మరునాడే సరిహద్దులో చైనా జవాన్లు జై శ్రీరామ్ అంటూ  నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

Ram Mandir inauguration: Video of Chinese soldiers chanting 'Jai Shri Ram' along with Indian troops resurfaces lns
Author
First Published Jan 23, 2024, 11:45 AM IST | Last Updated Jan 23, 2024, 11:45 AM IST

న్యూఢిల్లీ:  అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం ఈ నెల  22న జరిగింది. రామాలయంలో రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్టన చేశారు.  

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరిగిన మరునాడే  వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత ఆర్మీ జవాన్లతో  కలిసి చైనా సైనికులు  జై శ్రీరాం అని నినాదాలు చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతుంది.అయితే ఈ వీడియోలో స్పష్టమైన తేదీ మాత్రం లేదు.

చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సిబ్బందికి జై శ్రీరామ్ అని నినాదాలు చేయడంలో  భారతీయ సైనికుల బృందం   సహాయం చేస్తున్నట్టుగా ఈ వీడియోలో ఉంది. రెండు వైపులా టేబుల్స్ ఏర్పాటు చేసి ఉన్నాయి.  

స్నాక్స్ తో, పానీయాలు ఉన్నట్టుగా ఈ వీడియోలో కన్పించాయి. భారతదేశం, చైనాల మధ్య లడక్ లో దీర్ఘకాలంగా సరిహద్దులో ఉద్రిక్తతలు ఉన్న విషయం తెలిసిందే. అయితే  ఈ తరుణంలో రెండు దేశాలకు చెందిన సైనికులు  జై శ్రీరామ్ అంటూ  నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ మారింది. అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహానికి  ప్రాణ ప్రతిష్ట జరిగిన మరునాడే ఈ వీడియో బయటకు వచ్చింది.

 

అయితే ఈ వీడియో నిజమైందా, లేదా  అనే విషయమై  స్పష్టత లేదు.  అయితే ఈ వీడియో కనీసం మూడు మాసాల క్రితం చిత్రీకరించిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.ఈ నెల  22న  అయోధ్యలోని రామ మందిరంలో  రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట జరిగింది.   ప్రాణ ప్రతిష్ట తర్వాత రామ్ లల్లా విగ్రహాన్ని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన  ఎనిమిది వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios