హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లా అధ్యక్షులను నియమించారు.హైద్రాబాద్ నగరానికి నలుగురు అధ్యక్షులను నియమించారు.

అంబర్ పేట జిల్లా అధ్యక్షుడిగా గౌతం రావు, గోల్కోండ అధ్యక్షుడిగా పాండు యాదవ్, భాగ్యనగర్ మలక్ పేట అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డి, మహంకాళి సికింద్రాబాద్ అధ్యక్షుడిగా శ్యాంసుందర్ గౌడ్ ను నియమించారు.

మేడ్చల్ అర్బన్ జిల్లాకు పన్నాల హరీష్ రెడ్డి, మేడ్చల్ రూరల్ అధ్యక్షుడిగా విక్రం రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా అరుణతార, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా సామ రంగారెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణరావు,, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా భాగ్యరెడ్డి , వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సదానందరెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా గల్లా సత్యనారాయణను నియమించారు.

 బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత మాసంలోనే కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యవర్గంపై పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. రాష్ట్ర కార్యవర్గం కూర్పు సరిగా లేదని కొందరు నేతలు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.