రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం కోనరావుపేటలో మంత్రి కాన్వాయ్‌ని బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.  

రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం కోనరావుపేటలో మంత్రి కాన్వాయ్‌ని బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. 

రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్‌ను అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు యత్నించాయి. కాన్వాయ్‌లోకి కార్యకర్తలు దూసుకువచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో బీజేపీ కార్యకర్త ఒకరు పోలీసులను ఛేదించుకుని రోడ్డుపైకి దూసుకురావడంతో కానిస్టేబుల్ అతనిని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు బీజేపీ కార్యకర్తల ప్రయత్నాన్ని టీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా ప్రతిఘటించాయి.

Also Read:మాకు ఓపిక నశిస్తే.. మీరు బయట తిరగలేరు: బీజేపీకి మంత్రి కేటీఆర్ వార్నింగ్

ఈ నేపథ్యంలో బీజెపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాటతో ఘర్షణ వాతావరణం ఏర్పడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంతో వారిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. అనంతరం మంత్రి కేటీఆర్ పోలీసు బందోబస్తు మధ్య తన పర్యటన పూర్తి చేశారు.

కాగా, ఆదివారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ నేతల దాడిపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వారికి వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి బదులుగానే కేటీఆర్‌కు బీజేపీ శ్రేణులు నిరసన తెలియజేశాయి.