ప్రగతి భవన్కు ముట్టడికి బీజేపీ కార్యకర్తల యత్నం.. తీవ్ర ఉద్రిక్తత..
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ శ్రేణులు యత్నించాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ శ్రేణులు యత్నించాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జీవో నెంబర్ 317కు వ్యతిరేకంగా, టీచర్ల డిమాండ్‌లను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ కార్యకర్తలు ప్రగతి వద్ద నిరసన తెలిపేందుకు బయలుదేరారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వ్యాన్‌లలో అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక, ప్రగతి భవన్ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు.