పోలీస్ స్టేషన్లో పుట్టినరోజు వేడుకా..! ఎందుకై ఉంటుందబ్బా?

birtday celebrations at badrachalam police station
Highlights

  • ఉద్యోగులతో పాటు ధర్నా చేస్తూ అరెస్టైన డీఆర్డీఏ ప్రాజెక్ట్ మేనేజర్ నాగార్జున
  • అదేరోజు అతడి కొడుకు నిపున్ భర్త్ డే
  • భద్రాచలం పోలీస్ స్టేషన్లో పుట్టినరోజు వేడుకలు

ఎవరైనా అరెస్టై పోలీస్ స్టేషన్ కి వెళితే బాధ పడతారు. కుటుంబసభ్యులను మిస్ అవుతుంటారు. అలా కాకుండా అరెస్టు తర్వాత కూడా పోలీస్ స్టేషన్లోనే కుటుంబసభ్యులతో హాయిగా గడిపై అదృష్టం మాత్రం  భద్రాచలం డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ నాగార్జున కు దక్కింది. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే భందువులు, మిత్రుల సమక్షంలో అతడి కొడుకు భర్త్ డే ను అంగరంగవైభవంగా చేశారు. ఇంతకి అతడెందుకు అరెస్టయ్యాడు, అతడి కొడుకు భర్త్ డే పోలీస్ స్టేషన్ లో ఎలా జరపగలిగాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
భద్రాచలం లో తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మాలన సంస్థ(సెర్ప్) ఉద్యోగులు వారి సమస్యలను పరిష్కారం కోసం జేఏసి ఆద్వర్యంలో గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం పోలీసుల అనుమతి లేకుండా బ్రిడ్జి సెంటర్ లో ర్యాలీ చేపట్టారు. దీంతో పోలీసులు ఈ ర్యాలీకి నేతృత్వం వహించిన వారందరిని అరెస్ట్ చేశారు. ఇందులో డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ నాగార్జున కూడా ఉన్నారు. అరెస్టైన ఉద్యోగులను పోలీసులు వదిలిపెట్టకుండా రాత్రి సమయంలో కూడా స్టేషన్లోనే ఉంచుకున్నారు.
అయితే మంగళవారమే నాగార్జున కుమారుడు నిపున్ పుట్టినరోజు ఉంది. కుటుంబసభ్యులు అందుకు అన్ని ఏర్పాట్లు చశారు. అయితే హటాత్తుగా నాగార్జున అరెస్ట్ కావడం, రాత్రయినా పోలీసులు వదలకపోవడంతో వారు ఓ ఆలోచన చేశారు. పోలీసుల అనుమతి తీసుకుని ఈ వేడుకను పిల్లాడి తండ్రి నాగార్జున ఎదురుగా చేయాలనుకున్నారు. అందుకు పోలీసులు కూడా అనుమతించడంతో పోలీస్ స్టేషనే ఈ వేడుకకు వేదికైంది. పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులు, కుటుంబసభ్యులు, నాగార్జున మద్య నిపున్ పుట్టినరోజు జరుపుకున్నాడు. 
 

loader