రవిని ఎలిమినేట్ చేయడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానించారు.  తెలంగాణ వ్యక్తిని బయటకు పంపించి మరోసారి  కొట్లాట పెట్టడానికి పథకం రచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలుగు బిగ్ బాస్ తో పాటు  హిందీ బిగ్ బాస్ ను సైతం  బ్యాన్ చేయాలని కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని తెలిపారు. 

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న Bigg Boss Telugu 5ను బ్యాన్ చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే rajasingh డిమాండ్ చేశారు. telanganaలో బిగ్ బాస్ గేమ్ షోను చేయాలని, అసలు షో లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. ఈ షో ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని నిర్వాహకులను ప్రశ్నించారు.

రవి ని ఎలిమినేట్ చేయడం వెనుక ఏదో Conspiracy దాగి ఉందని ఆయన అనుమానించారు. తెలంగాణ వ్యక్తిని బయటకు పంపించి మరోసారి కొట్లాట పెట్టడానికి పథకం రచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు బిగ్ బాస్ తో పాటు హిందీ బిగ్ బాస్ ను సైతం బ్యాన్ చేయాలని కేంద్ర Home Minister Amit Shah కు లేఖ రాస్తానని తెలిపారు.

 బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ లో పాల్గొన్న వారిలో anchor ravi అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నవాడు. అతడు ఎంట్రీ ఇచ్చినప్పుడు టాప్ ఫైవ్ పక్కా అని అంతా డిసైడ్ అయ్యారు. కానీ అనూహ్యంగా పన్నెండవ వారంలోనే అతడిని Eliminate చేసి పంపించేశారు.

తనకంటే తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ లను హౌస్ లో ఉంచి రవిని అన్యాయంగా ఆటలో నుంచి తొలగించారు. దీన్ని రవి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియాలో తమ ఆవేశం వెళ్లగక్కుతున్నారు. ఎవరినో సేవ్ చేయడం కోసం రవికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, Bigg Boss Telugu 5వ సీజన్‌ నుంచి 12వ వారంలో అనూహ్యంగా Anchor Ravi ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా రవి ఎలిమినేట్ కావడం అందరిని షాక్‌కి గురి చేస్తుంది. దీనిపై రవి అభిమానులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ నిరసనలను తెలియజేస్తున్నారు. బిగ్‌బాస్‌ నిర్వహకులపై ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు బిగ్‌బాస్‌ తెలుగు 5 నిర్వహణ, ఓటింగ్‌ చర్చనీయాంశంగా మారింది. 

Bigg Boss Telugu 5: సిరి మదర్‌ ఇచ్చిన స్ట్రోక్స్ కి వణుకుతున్న షణ్ముఖ్‌.. మొత్తానికి కాజల్‌ బకరా అయిపోయిందిగా

రవి ఎలిమినేషన్ మీద నిరసన తెలుపుతూ, బిగ్‌బాస్‌ షోకి వస్తున్న ఓట్లని బహిర్గతం చేయాలని, తెలంగాణ వ్యక్తికి అన్యాయం జరిగిందని తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా కన్వీనర్ నవీన్‌ గౌడ్‌ నిరసన వ్యక్తం చేశాడు. కొంత మందితో కలిసి వచ్చి అన్నపూర్ణ స్డూడియో వద్ద ఆందోళనకి దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. హౌజ్‌లో వీక్‌గా ఉన్న వారికి ఎక్కువ ఓట్లు రావడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది హాట్‌ టాపిక్‌గా మారడంతోపాటు, వివాదంగానూ మారింది. అయితే దీనిపై తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం స్పందించింది. నవీన్‌ గౌడ్‌పై వేటు వేసింది. 

అన్నపూర్ణ స్టూడియోస్ ముందు జరిగిన ఆందోళనలో తమ అనుమతి లేకుండా పాల్గొన్నందుకు అతని మీద క్రమశిక్షణ చర్యగా విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ పదవి నుంచి తక్షణమే తొలగించడం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్‌ అర్చన సేనాపతి వెల్లడించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఇతనొక్కడే పాల్గొన్నాడని, తెలంగాణ జాగృతి సంస్థకు, ఆందోళన కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.