రవిపై చాలా అంచనాలున్నాయని, ఆయన వాటిని రీచ్ కాలేదని, దీని వల్ల ఓట్లు తగ్గిపోయాయని సిరి చెప్పింది. దీనికి షణ్ముఖ్ రియాక్ట్ అవుతూ, దానికే అన్ని ఓట్లు తగ్గిపోతాయా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
బిగ్‌బాస్ తెలుగు 5(Bigg Boss Telugu 5).. 12 వారాలు పూర్తి చేసుకుని పదమూడో(13వ) వారంలోకి అడుగుపెట్టింది. ఆదివారం ఊహించని విధంగా రవి(Anchor Ravi) ఎలిమినేట్ అయ్యారు. ఇది అటు హౌజ్‌లో, ఇటు బయట హాట్ టాపిక్ అయ్యింది. వివాదంగా మారింది. దీని గురించే చర్చ జరుగుతుంది. సోమవారం ఎపిసోడ్‌లో కూడా షణ్ముఖ్-సిరి.. రవి ఎలిమినేషన్ గురించే మాట్లాడుకున్నారు. సన్నీ-కాజల్, మానస్-కాజల్ మధ్య ఇదే టాపిక్ నడిచింది. రవి వెళ్లిపోవడంపై షణ్ముఖ్(Shanmukh), సిరి(Siri) మధ్య సీరియస్ డిస్కషన్ జరిగింది. ఇప్పటి వరకు చాలా మంది ఎలిమినేట్ అయ్యారు బాధపడ్డాను, కానీ రవి వెళ్లిపోతే చాలా బాధగా అనిపించిందని సిరి ఆవేదన చెందింది.
రవిపై చాలా అంచనాలున్నాయని, ఆయన వాటిని రీచ్ కాలేదని, దీని వల్ల ఓట్లు తగ్గిపోయాయని సిరి చెప్పింది. దీనికి షణ్ముఖ్ రియాక్ట్ అవుతూ, దానికే అన్ని ఓట్లు తగ్గిపోతాయా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. రవి ఎలిమినేషన్ విషయంలో ఇంకా ఏదో జరిగిందనే అనుమానాన్ని పరోక్షంగా వెల్లడించారు. అదే సమయంలో ఇకపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలని, చాలా జాగ్రత్తగా ఆడాలని చెప్పుకున్నారు. మరోవైపు రవి ఎలిమినేట్ అయిన కాసేపటికే సన్నీ, కాజల్ జోకులు వేసుకుని నవ్వుకున్నారని అన్నాడు షణ్ముఖ్. రవి వెళ్లిపోవడంతో శ్రీరామ్ ఒంటరైపోయాడు. ఆయనకు సపోర్ట్ గా ఉండాలని, ఇద్దరం శ్రీరామ్‌తో మాట్లాడాలని అనుకున్నారు షన్ను, సిరి.
అదే సమయంలో మాసన్, కాజల్(Kajal) మధ్య రవి గురించి చర్చ జరిగింది. ఆయన బయట, ఇంట్ల ఒకేలా ఉన్నాడని, జెన్యూన్‌గా లేదనే విషయాన్ని వెల్లడించారు. అందరితో కాన్ఫ్టిక్ట్స్ పెట్టుకోవాలని రవి అనుకున్నాడని, అదే ఆయనకు దెబ్బకొట్టిందని తెలిపారు. దీనిపై Kajal తన అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు పింకీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు షణ్ముఖ్. వాళ్లంతా(మానస్,సన్నీ, కాజల్) కలిసి గేమ్ ఆడుతున్నారని, ఎవరు ఉంటే తమకి దెబ్బ అనే లెక్కలు వేసుకుని ఆడుతున్నారని, నామినేట్ చేసేందుకు ఉన్న అవకాశాలేంటనేది పింకీకి చెప్పాడు షణ్ముఖ్. మొత్తంగా ఆ గ్రూప్ వాళ్లని నామినేట్ చేసేలా ప్రయత్నించాడు.
మరోవైపు సిరిపై ఓ కామెంట్ చేశాడు షణ్ముఖ్. తమ రిలేషన్‌కి సంబంధించి మాట్లాడుతూ, బయటకు వెళ్లాక నాకు ఉంటందీ అన్నాడు. దీంతో సిరి అలిగి వెళ్లిపోయింది. ఆమె వద్దకి వెళ్లి సారీ చెప్పాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆ తర్వాత షణ్ముఖ్‌కి హగ్ ఇవ్వాలనుకుంది సిరి. కానీ షణ్ముఖ్ నో చెప్పాడు. సిరి మదర్ అన్న మాటలను గుర్తు చేస్తూ దెండెం పెట్టాడు. ఎందుకొచ్చిన గోల మళ్లీ మీ మదర్ ఇంకేదో అనుకుంటుందంటూ ఆమెని తిరస్కరించాడు. అయినా సిరి పట్టుబట్టి హగ్ ఇప్పించుకుంది. అప్పుడు కూడా ఆమెని పూర్తిగా హగ్ చేసుకోలేదు. సరికదా ఇది జస్ట్ ఫ్రెండ్‌షిప్ మాత్రమే అంటూ పదే పదే చెప్పే ప్రయత్నం చేశాడు. మొత్తంగా సిరి మదర్ అంటే ఇప్పుడు షణ్ముఖ్ వణికిపోతున్నాడని అంటున్నారు నెటిజన్లు
ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో నామినేట్ చేసి,వారి ముందున్న బాల్స్ ని హౌజ్ డోర్ బయటికి తన్నాల్సి ఉంటుంది. ఇందులో షణ్ముఖ్, సిరి, పింకీ, శ్రీరామ్ కలిసి కాజల్‌ని బకరా చేశారు. షణ్ముఖ్, పింకి, సిరి.. గత వారం కెప్టెన్సీ టాస్క్ లో పింకీకి ఛాన్స్ ఇస్తే ఆమె కెప్టెన్ అవుతుందని, వాళ్ల కమ్యూనిటీకి స్ఫూర్తిగా నిలుస్తుందని కాజల్ వ్యాఖ్యానించింది. దీన్నితీసి ఇప్పుడు నామినేట్ చేశారు. ఆ విషయాన్ని పదే పదే తీస్తూ షణ్ముఖ్,సిరి, పింకీ నామినేట్ చేయడంతో కాజల్‌కి చిర్రెత్తిపోయింది. ఇక ఇందులో కెప్టెన్ షణ్ముఖ్ తన నామినేషన్‌ని పింకీ,కాజల్‌కి చేశాడు.
పింకీ.. సిరి, కాజల్‌ని చేసింది, సిరి.. కాజల్, పింకీని చేసింది. సన్నీ.. సిరి, శ్రీరామ్‌లను, శ్రీరామ్..మానస్, కాజల్‌ని నామినేట్ చేశారు. మానస్..శ్రీరామ్, సిరిని, కాజల్.. పింకీ, సిరిలను నామినేట్ చేసింది. అంతిమంగా పదమూడో వారంలో కాజల్, సిరి, పింకీ, శ్రీరామ్, మానస్ నామినేట్ అయ్యారు. సన్నీకి ఒక్క నామినేషన్ కూడా రాలేదు. దీంతో ఆయన ఈ వారం సేవ్ అయిపోయాడు. మరోవైపు కెప్టెన్ కారణంగా షణ్ముఖ్‌ని ఎవరూ నామినేట్ చేసే ఛాన్స్ లేదు. ఇలా సన్నీ, షణ్ముఖ్ ఈ వారం సేఫ్ జోన్‌లో ఉన్నారు.
also read: Bigg Boss Telugu 5: యాంకర్ రవి కోసం ఆందోళన చేసిన తెలంగాణ జాగృతి విద్యార్థి నాయకుడిపై వేటు
also read: Bigg Boss Telugu 5: రవి ఎలిమినేటెడ్.. వెక్కి వెక్కి ఏడ్చిన సన్నీ, కాజల్ కోసం ఎవిక్షన్ ప్రీ పాస్
