Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఇద్దరు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు

బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీలు గోడం నగేష్, సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావ్ లు పార్టీ కండువా కప్పుకున్నారు.

Big shock for BRS. Two ex-MPs, ex-MLAs join BJP..ISR
Author
First Published Mar 10, 2024, 7:37 PM IST

తెలంగాణలో మరో సారి బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ పార్టీలోని నేతలు ఇతర పార్టీలోకి వలస వెళ్తుండగా.. లోక్ సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఈ వేగం మరింత పెరిగింది. తాజాగా ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. మరో కాంగ్రెస్ నాయకుడు కాషాయ పార్టీలో చేరారు. దీంతో రాష్ట్రంలో బీజేపీకి మరింత బలం పెరిగింది.

భారత్, ఈఎఫ్టీఏ మధ్య వాణిజ్య ఒప్పందం.. 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యం..

ఆదిలాబాద్ మాజీ ఎంపీ గోడం నగేష్, మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ లు, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావులు ఆదివారం రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ సమక్షంలో ఢిల్లీలో బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు మరో కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గోమాసే కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. 

ఈ సందర్భంగా ఎంపీ కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇతర పార్టీల నాయకులు తమ వారసుల భవిష్యత్తు కోసం పనిచేస్తుంటే, మోడీ దేశం కోసం పనిచేస్తున్నారని అన్నారు. అనంతరం తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. వారసత్వ, అవినీతి పార్టీలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. బీఆర్ఎస్ ట్రిపులు బీ పార్టీ అని విమర్శించారు. ఆ పార్టీని ‘‘బాబా, బేటా, బేబీ’’ గా ఆయన అభివర్ణించారు. ముగ్గురు నాయకులు రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. గత పదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నారని, ఇది ప్రజలను ఆకట్టుకుందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios