మాదాపూర్ డ్రగ్స్ కేసు.. హీరో నవదీప్‌కు హైకోర్టులో ఊరట
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కాగా.. హైదరాబాదులోడ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. ఈరోజు నటుడు నవదీప్ కు నార్కోటిక్ పోలీసులు నోటీసులు అందజేయనున్నారు. నవదీప్ పరారీలో ఉన్నట్లు సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. మోడల్ శ్వేత గురించి గాలింపు చేపట్టారు. అమోబీతో సహా నలుగురు నిందితులను నాంపల్లి కోర్టుకు తీసుకెడుతున్నారు. వీరితో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన మరో నలుగురు కూడా ఉన్నారు. వీరికి కోర్టు ముందు హాజరు పరిచిన తరువాత రిమాండ్ కోరనున్నారు.
డ్రగ్స్ కేసులో ఇటీవల పట్టుబడిన సినీ ఫైనాన్షియర్ కె వెంకటరత్నారెడ్డి, మరో నిందితుడైన కాప భాస్కర్ బాలాజీలను టీఎస్ న్యాబ్ (తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో నైజీరియన్లతో పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారికి సంబంధాలు ఉన్నట్లుగా వెలుగు చూశాయి. కె వెంకటరత్నారెడ్డి, కాప భాస్కర్ ఇచ్చిన సమాచారంతో ముగ్గురు నైజీరియన్లు, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ విఠల్ రావు కుమారుడు దేవరకొండ సురేష్ రావు, సినీ దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి, సినీ పరిశ్రమతో సంబంధాలు ఉన్న రాంచంద్ మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
అయితే ఈ విషయంపై స్పందించిన నవదీప్ ట్వీట్ చేస్తూ.. చిన్న సెటైర్ కూడా వేశాడు. జెంటిల్మెన్ అది నేను కాదు.. నేను ఇకడే ఉన్నాను.. ఎక్కడికి పారిపోలేదు.. అసలు దానితో నాకు సబంధం లేదు దయచేసి క్లారిటీ తెచ్చుకోండి, థాంక్స్" అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు నవదీప్. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు నవదీప్.. తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాదులోని ఉన్నానని, డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. తాను కూడా ప్రెస్ మీట్ చూశానని కమిషనర్ హీరో నవదీప్ అని ఎక్కడా మెన్షన్ చేయలేదని, అతను వేరే నవదీప్ అయి ఉంటాడని యంగ్ హీరో క్లారిటీ ఇచ్చాడు.