లెఫ్ట్‌తో పొత్తు నష్టమే: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
టిక్కెట్లు దక్కనివారు నిరాశ చెందవద్దని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: వామపక్షాలతో పొత్తు నష్టమేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.ఆదివారం నాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టిక్కెట్లు రాని వారికి పదవులు వస్తాయన్నారు. టిక్కెట్లు రాలేదని నిరాశ చెందవద్దని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారడం బాధాకరమన్నారు.టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు చేయడం సరైంది కాదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.రేవంత్ రెడ్డిని తిడితే అధిష్టానాన్ని తిట్టినట్టేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ముక్కలు కావడం ఖాయమని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.
also read:టిక్కెట్టు నిరాకరణ: అనుచరులతో నాగం జనార్థన్ రెడ్డి భేటీ
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ఇవాళ విడుదల చేసింది. రెండు మూడు రోజుల్లో రెండో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. లెఫ్ట్ పార్టీలతో పొత్తులు కుదిరిన తర్వాత మరో జాబితాను కాంగ్రెస్ ను విడుదల చేయనుంది.ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో విజయం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. దీంతో కర్ణాటక ఫార్మూలాను అమలు చేస్తుంది. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలో కూడ ఆరు గ్యారంటీ స్కీమ్ లను అమలు చేస్తామని హామీ ఇచ్చింది.
ఈ నెల 9వ తేదీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్దమౌతున్నాయి. ప్రచారంపై పార్టీలు ఫోకస్ పెంచాయి. ఆయా పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ్టి నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 18 నుండి కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను ప్రారంభించనుంది. ములుగు నుండి కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభిస్తుంద. తొలుత ఈ యాత్రను కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుండి ప్రారంభించాలని భావించారు. కానీ రూట్ మ్యాప్ మార్చారు. ములుగు నుండి ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీలు ప్రారంభించనున్నారు.