నల్గొండ అసెంబ్లీ టిక్కెట్టు: ధరఖాస్తు చేసుకున్న కోమటిరెడ్డి

నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్టు కోసం  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధరఖాస్తు చేసుకున్నారు.
 

Bhuvanagiri MP Komatireddy Venkat Reddy Applies  For  Congress Ticket From Nalgonda Assembly Segment lns


నల్గొండ:  నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్టు కోసం  ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారంనాడు ధరఖాస్తు చేసుకున్నారు.  2018 ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేసి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఓటమి పాలైన విషయం తెలిసిందే.  వచ్చే ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధిగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  పోటీ చేయనున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి  1999లో  నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తొలిసారి  అసెంబ్లీలో అడుగు పెట్టారు.  ఆనాడు  సీపీఎం అభ్యర్ధి నంద్యాల నర్సింహారెడ్డిపై  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు.  2004, 2009, 2014 ఎన్నికల్లో కూడ  ఇదే స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు.  2018 ఎన్నికల్లో  నల్గొండ నుండి  పోటీ చేసి  బీఆర్ఎస్ అభ్యర్థి  కంచర్ల భూపాల్ రెడ్డి  చేతిలో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్థిగా  పోటీ చేసి విజయం సాధించారు. 

ఇదిలా ఉంటే  ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా  మరోసారి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బరిలోకి దిగనున్నారు.  నల్గొండ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే  కంచర్ల భూపాల్ రెడ్డిని  బీఆర్ఎస్ బరిలోకి దింపింది.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios