బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఆమెకు హెల్త్ బాగాలేదని, గర్భవతి అనే వార్తలు రావడంతో, అఖిలప్రియకు అర్ధరాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా వైద్యపరీక్షలు నిర్వహించారు.

శుక్రవారం అర్ధరాత్రి ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన చంచల్‌గూడ జైలు అధికారులు వైద్యపరీక్షలు చేయించారు. సోమవారం రోజున అఖిలప్రియ హెల్త్ కండిషన్ పై కోర్టుకు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండటంతో జైలు అధికారులు హుటాహుటిన వైద్యపరీక్షలు నిర్వహించారు.  

Also Read:అఖిలప్రియను వారంరోజుల కస్టడీకి ఇవ్వండి : కోర్టులో పిటిషన్..

అఖిలప్రియ గర్భవతి అని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేయడంతో, వైద్యపరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో జైలు అధికారులు ఆమెకు సిటీ స్కాన్, అల్ట్రా సౌండింగ్ స్కానింగ్ చేయించారు.

అయితే, రిపోర్టులో ఆమె గర్భవతి కాదని తెలిసినట్టు అధికారులు చెప్తున్నారు. స్కానింగ్ రిపోర్ట్ నెగెటివ్ రావడంతో బెయిల్ పై ఉత్కంఠత నెలకొన్నది. మరి అఖిలప్రియకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేక కస్టడికి ఇస్తుందా అన్నది సోమవారం తేలనుంది.