ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్ఆర్సి లపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లులను మైనార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా బిజెపి అధికారంలో లేని రాష్ట్రాలలో ఆందోళనలు అధికంగా జరుగుతున్నాయి. 

దీనిపై తెలంగాణ కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత  భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పాటు టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలని కూడా విమర్శించారు. 

నాలుగు గోడల మధ్య తలుపులేసుకుని దారుస్సలాంలో మీటింగులు పెట్టడం కాదు. బీజేపీ విధానాలని వ్యతిరేకించేలా బయటకు వచ్చిన నిరసన కార్యక్రమాలు చెప్పట్టాలని  భట్టి విక్రమార్క ఎంఐఎం పార్టీకి సూచించారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎంఆర్సీకి వ్యతిరేకంగా డిసెంబర్ 28న భారీ ర్యాలీ నిర్వహిచబోతున్నాం. 

ఎన్ఆర్‌సీకి వ్యతిరేకం: తేల్చేసిన సీఎం జగన్

ఆ ర్యాలీకి మద్దతునిచ్చి అందులో పాల్గొంటారా అని  భట్టి విక్రమార్క ఎంఐఎం నేతలని మీడియా ముఖంగా ప్రశ్నించారు. అసలు ఎంఐఎం లాంటి పార్టీలు ఉండడం వల్లే బీజేపీ మతతత్వ విధానాలు అవలంబిస్తోంది అని భట్టి విక్రమార్క విమర్శించారు. 

పౌరసత్వ సెగ: ప్రతిపక్షాలపై మోడీ విసుర్లు

ఎంఐఎం పార్టీ వ్యవహార శైలివల్ల ప్రస్తుతం మైనార్టీలు బయటికి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని  భట్టి విక్రమార్క ఆరోపించారు. బిజెపియేతర రాష్ట్రాలన్నీ కేంద్ర విధానాలని వ్యతిరేకిస్తుంటే కేసీఆర్ మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారు అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. 28న కాంగ్రెస్ నిర్వహించే ర్యాలీలో ప్రజలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.