కడప:  ఎన్ఆర్‌సీకి వైసీపీ వ్యతిరేకమని  ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.సోమవారం నాడు కడప జిల్లాలో జరిగిన ఓ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ విషయమై ఆయన స్పష్టత ఇచ్చారు. ఎన్ఆర్‌సీకి  వ్యతిరేకంగా తమ వైఖరి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.

కడప జిల్లాలో జరిగిన  ఓ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్, డిప్యూటీ సీఎం అంజద్ బాషాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజద్ బాషా‌ ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా  మాట్లాడారు.

ఆ తర్వాత మాట్లాడిన సీఎం వైఎస్ జగన్  కూడ ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఎన్ఆర్‌సీకి వ్యతిరేకమని సీఎం వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. డిప్యూటీ సీఎం అంజద్ భాషా చేసిన వ్యాఖ్యలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని  తేల్చి చెప్పారు.