అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కేసులో భానుకిరణ్ అనే నిందితుడికి ఏడాదిపాటు జైలు శిక్ష పడింది. భానుతోపాటు మరో ఇద్దరికి కూడా ఏడాది శిక్ష పదివేల రూపాయల జరిమానా విధించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టు  ఆదేశాలు జారీ చేసింది.

2009లో భానుకిరణ్ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇవాళ తీర్పు వెలువడింది. అయితే రాయలసీమ ఫ్యాక్షనిస్టు మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరి హత్య కేసులో భానుకిరణ్ ప్రధాన నిందితుడు. సూరి హత్య తర్వాత నుంచి ఇప్పటి వరకు భాను కిరణ్ జైలులోనే ఉంటున్నాడు. నాంపల్లి కోర్టులో విచారణ ముగిసింది. త్వరలోనే ఈకేసులో శిక్షలు ఖరారు కానున్నాయి.