తప్పుడు పత్రాలతో గల్ప్ వెళ్లాలని ప్రయత్నించిన తెలంగాణ మహిళలను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. జైలుకు తరలించారు. అయితే ఆమె గల్ప్ ఏజెంట్ చేతిలో మోసపోయిందని విచారణలో తేలడంతో ఆమెను జైలు నుంచి విడుదల చేశారు. 

ఆమె ఓ పేద మ‌హిళ‌. గ‌ల్ప్ దేశాల‌కు వెళ్తే త‌న ఆర్థిక క‌ష్టాలు అన్నీ తీరుతాయ‌ని భావించింది. దీని కోసం ఓ గ‌ల్ప్ ఏజెంట్ ను సంప్ర‌దించింది. అతడిని పూర్తిగా న‌మ్మింది. కానీ అత‌డు మోసం చేశాడు. త‌ప్పుడు ప‌త్రాల‌ను సృష్టించి విదేశం పంపించాల‌ని చూశాడు. కానీ ఎయిర్ పోర్టులో అధికారులు ప‌ట్టుకున్నారు. అనంత‌రం ఆమెను జైలుకు త‌ర‌లించారు. సుదీర్ఘ న్యాయ విచార‌ణ త‌రువాత ఎట్ట‌కేల‌కు జైలు నుంచి విడుద‌ల అయ్యారు.

పటేల్ కృషితో నిజాం పాలన నుంచి విముక్తి.. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయి: అమిత్ షా

కేరళలోని కక్కనాడ్ జిల్లా జైలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన విజయలక్ష్మి అనే అభాగ్యురాలు విడుద‌లైంది. ఆమె సెప్టెంబర్ 7 నుంచి ఆమె జైలులో మ‌గ్గుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో రిక్రూట్‌మెంట్ ఏజెంట్ కువైట్‌లో హౌస్‌కీపింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడు.

40 ఏళ్ల వితంతువు అయిన విజ‌య‌ల‌క్ష్మిని ఏజెంట్ సెప్టెంబర్ 5వ తేదీన హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా మస్కట్ పంపించాడు. అయితే ఎయిర్‌పోర్టు అధికారులు ఆమె పత్రాల్లో తేడాల‌ను గుర్తించారు. దీంతో ఆమెను తిరిగి కొచ్చికి పంపించారు. నెడుంబస్సేరి పోలీసులు బాధితురాలిని దుపులోకి తీసుకుని కక్కనాడ్ జిల్లా జైలుకు తరలించారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఎలాంటి భారీ భ‌ద్ర‌త ఉంటుందో తెలుసా ? అస‌లు ఎస్పీజీ అంటే ఏమిటి ?

పేదరికంతో బాధపడుతున్న ఆ మహిళకు.. తనను అస‌లు పోలీసులు ఎందుకు నిర్బంధించాడో కూడా తెలియక తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆమెకు తెలుగు తప్ప వేరే భాష రాకపోవడంతో ఈ విష‌యాన్ని పోలీసులను కూడా అడగలేకపోయింది. అయితే బాధితురాలికి కొన్ని రోజుల త‌రువాత న్యాయ సహాయం లభించిందని ‘డెక్కన్ క్రానికల్’ నివేదించింది. దీంతో నెడుంబస్సేరి పోలీసులు కూడా ఆమె నిర్దోషి అని తేల్చారు. బాధితురాలు ఏజెంట్ చేతిలో మోస‌పోయింద‌ని గ్ర‌హించారు.

దారుణం.. వాయిదా చెల్లించ‌డం లేద‌ని గొడ‌వ‌.. గ‌ర్భిణిపై ట్రాక్ట‌ర్ ఎక్కించిన లోన్ రిక‌వ‌రీ ఏజెంట్.. ఎక్క‌డంటే ?

‘‘ నేను ఇంత త్వరగా జైలు నుంచి బయటకు వస్తానని అనుకోలేదు. నన్ను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. రిపోర్టర్‌గా పనిచేస్తున్న నా బంధువు ద్వారా ఆ సంస్థ ఎడిటర్ రేష్మిని సంప్రదించాను. ఆమె కొచ్చిన్ లో ఉన్న స్మిత స‌హాయం కోరారు. దీంతో ఆమె ఒక లాయ‌ర్ ను ఏర్పాటు చేశారు. వారి ప్ర‌య‌త్నాల ఫ‌లితంగా నేను జైలు నుండి విడుదలయ్యాను. డ‌బ్బు సంపాద‌న కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. గ‌ల్ప్ ఏజెంట్లు త‌ప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మహిళలను మోసం చేయ‌వ‌చ్చు ’’ అని బాధితురాలు ఎర్నాకులం నుంచి విజయవాడకు రైలు ఎక్కే ముందు ‘డెక్కన్ క్రానికల్’ కు చెప్పారు.