ములుగు ఎమ్మెల్యే సీతక్క బయోపిక్ తీస్తానని సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. ఓ ట్విట్టర్ యూజర్ ఇచ్చిన సూచనను ఆయన స్వీకరించారు. సీతక్క బయోపిక్ తీయడంపై ఆలోచిస్తానని, ఆమె కథను సినిమా తీస్తానని వివరించారు.
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేతగా గతంలో హల్ చల్ చేసిన బండ్ల గణేష్ మళ్లీ యాక్టివ్ అవుతున్నట్టు తెలుస్తున్నది. ఇటీవలే ఆయన భట్టి విక్రమార్క పాదయాత్రను పొగుడుతూ.. ఆయనను కలుస్తానని ట్వీట్ చేశారు. అంతేకాదు, జై కాంగ్రెస్ అంటూ ట్వీట్ చేయడం అప్పుడు చర్చనీయాంశమైంది. తాజాగా, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్, ములుగు ఎమ్మెల్యే సీతక్కను గురించి ట్వీట్ చేశారు. సీతక్క బయోపిక్ తీస్తా అని వెల్లడించారు.
ఓ ట్విట్టర్ యూజర్.. ఈ సూచన చేశారు. సీతక్క బయోగ్రఫీ మీద ఒక సినిమా తీయాలని ఆ యూజర్ బండ్ల గణేష్‌ను ట్యాగ్ చేసి కోరారు. మోహన్ బాబు సినిమా అడవిలో అన్న, రానా తీసిని లీడర్.. ఈ రెండు సినిమాలు కలిపితే నిజజీవితంలో ధనసరి అనసూయ అక్క అవుతుందని పేర్కొన్నారు.
Also Read: నా దగ్గర కేటీఎం బైక్ ఉంది.. కానీ, నడుపలేను.. ఎందుకంటే?: రాహుల్ గాంధీ
ఈ ట్వీట్ పై బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. ఇది అద్భుత సలహా అంటూ ప్రశంసించారు. తప్పకుండా ఈ విషయమై ఆలోచిస్తానని వివరించారు. అంతేకాదు, సీతక్క కథను సినిమా తీస్తాననీ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ వార్తల్లోకి వచ్చింది. కాంగ్రెస్ అభిమాను ల్లోనూ దీనిపై చర్చ మొదలైంది.
