Asianet News TeluguAsianet News Telugu

‘ఫ్రంట్ లేదు..టెంట్ లేదు.. దోచు కోవడం.. దాచుకోవడమే... ఎప్పుడైనా కేసీఆర్ జైలుకెళ్లొచ్చు’.. బండి సంజయ్...

కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపిస్తుందేమోనని.. ముందుగానే కేసీఆర్ సానుభూతి కోసం యత్నిస్తున్నాడని బండి సంజయ్ పేర్కొన్నారు. ‘ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు.. దోచు కోవడం.. దాచుకోవడమే... కేసీఆర్ ను ఎక్కడున్నా గుంజుకొచ్చుడే.. కేసీఆర్ డ్రామాలు చేస్తున్నాడు. జైలుకు పోవడం పక్కా’ అని బండి సంజయ్ పేర్కొన్నాడు. 

bandi sanjay sensational comments on kcr and federal front
Author
Hyderabad, First Published Jan 12, 2022, 12:43 PM IST

హైదరాబాద్ : సీఎం KCR అవినీతిపై కేంద్రం సీరియస్ గా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు bandi sanjay పేర్కొన్నారు. ఆల్రెడీ కేసీఆర్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైందన్నారు. ఎప్పుడైనా కేసీఆర్ jailకి వెళ్లొచ్చన్నారు. ఈ విషయం కేసీఆర్ కు తెలిసిపోయిందని.. అందుకే కమ్యూనిస్టులతోనూ, విపక్ష నేతలతోనూ భేటీ అవుతున్నాడన్నారు. 

కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపిస్తుందేమోనని.. ముందుగానే కేసీఆర్ సానుభూతి కోసం యత్నిస్తున్నాడని బండి సంజయ్ పేర్కొన్నారు. ‘ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు.. దోచు కోవడం.. దాచుకోవడమే... కేసీఆర్ ను ఎక్కడున్నా గుంజుకొచ్చుడే.. కేసీఆర్ డ్రామాలు చేస్తున్నాడు. జైలుకు పోవడం పక్కా’ అని బండి సంజయ్ పేర్కొన్నాడు. 

అంతేకాదు ఆయన ఎన్ని డ్రామాలు చేసినా కేంద్రం వదిలిపెట్టదన్నాడు. ఫాం హౌస్ లో పండేటోడు దేశ రాజకీయాల్లోకి వెళ్లి ఏం చేస్తాడు? అని ప్రశ్నించారు.

కాగా బండిసంజయ్ మీద టీఆర్ నేత, ఎమ్మెల్యే jeevan reddy విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ముట్టుకుంటే telanganaతో పాటు దేశం అగ్ని గుండం అవుతుందని పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఎ.జీవన్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే తాము Uttar Pradesh Elections ప్రచారంలో పాల్గొంటామని, అవసరమైతే సీఎంకూడా ప్రచారం చేస్తారని వెల్లడించారు.

టీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడుతూ బీజేపీ పార్టీని సర్కస్ కంపెనీగా మార్చి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ షో నిర్వహిస్తున్నాడని అన్నారు. వార్డు మెంబర్ గా కూడా గెలవని ఆ పార్టీ నేత మురళీధర్ రావు కాళేశ్వరంలో అవినీతి అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

శివరాజ్ సింగ్ చౌహాన్ దొడ్డిదారిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని, అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ తప్పుడు ప్రచారాలను గతంలోనే ఫేస్ బుక్ బ్యాన్ చేసిందని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఆ రాష్ట్ర మాజీ సీఎం పఢ్నవీస్ మహబూబ్ నగర్ సభకు ముఖం చాటేశారన్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా రాష్ట్రానికి చేసింది శూన్యం అన్నారు. 

ఇదిలా ఉండగా, దేశంలో Bjp, Congress వ్యతిరేక పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటుకు Trs  చీఫ్ kcr ప్రయత్నాలు ప్రారంభించారు. లెఫ్ట్ పార్టీలతో పాటు ఇతర పార్టీలతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో కేసీఆర్ పలు పార్టీలతో వరుస భేటీలు నిర్వహించడం చర్చకు దారితీసింది.

గత వారంలో cpi సీపీఎం జాతీయ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సీపీఐ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, cpmజాతీయ ప్రధాన కార్యదర్శి Sitaram Yechury ఏచూరిలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సీపీఎం అగ్రనేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

జాతీయ రాజకీయాలపై ఈ సమావేశంలో కేసీఆర్ లెఫ్ట్ పార్టీల నేతలతో చర్చించారు. ఈ భేటీ ముగిసిన నాలుగైదు రోజుల తర్వాత Rjd నేత తేజస్వి యాదవ్ తో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. తేజస్వియాదవ్  పాట్నా నుండి Hyderabad కు చేరుకొన్నారు. Tejashwi yadav తో కేసీఆర్ భేటీ అయ్యారు. తేజస్వి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ తో కూడా కేసీఆర్  ఫోన్ లో చర్చించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios