తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సంజయ్ తప్పుబట్టారు.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సంజయ్ తప్పుబట్టారు. కేటీఆర్ తీరు చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలే చీదరించుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. కేటీఆర్ డ్రగ్స్ వాడి ఉంటారని.. అందుకే అసెంబ్లీలో అలా ప్రవర్తించి ఉంటారని విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ భవిష్యత్తులో కేటీఆర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ రాజీనామా చేస్తారని జోస్యం చెప్పారు. అందుకే కేటీఆర్‌ను సీఎం అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించడం లేదని అన్నారు. దమ్ముంటే కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
దమ్ముంటే రానున్న అసెంబ్లీ ఎన్నిల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పోటీ చేయాలని మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్ సవాలు విసిరారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని తీగలగుట్టపల్లి వద్ద రైల్వే ట్రాక్ కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేదని విమర్శించారు.
రూ. లక్ష కోట్ల ఆస్తులతో బీఆర్‌ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని బండి సంజయ్ ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఎఫ్, సీసీఎస్ నిధులను దుర్వినియోగం చేస్తూ.. కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు డ్రామా ఆడుతున్నారని ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు, సీఎం బంధువులు లీజు ముసుగులో ఆర్టీసీ ఆస్తులను దోపిడీ చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు.
