ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు కారణమైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఖమ్మంలో BJP కార్యకర్త Sai Ganesh ఆత్మహత్యకు కారణమైన మంత్రి Puvvada Ajay పై కేసు నమోదు చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay డిమాండ్ చేశారు. సాయి గణేష్ మరణ వాంగ్మూలం మేరకు పోలీసులు మంత్రి పువ్వాడ అజయ్ పై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. CMO ఆదేశాల వల్లే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై Case నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. సాయి గణేష్ ఆత్మహత్యకు గల కారకులైన వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సాయి గణేష్ ఆత్మహత్యపై ఖమ్మంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
ఈ నెల 14న Khammamత్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముందు సాయి గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాాల్పడ్డాడు. వెంటనే బీజేపీ కార్యకర్తలు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. సాయి గణేష్ మరణించడానికి ముందు మీడియాతో మాట్లాడారు. తనను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులకు గురి చేశాడని చెప్పారు.
తనపై మంత్రి ఆదేశాలతో పోలీసులు 16 కేసులు నమోదు చేశారన్నారు. అంతేకాదు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారన్నారు. పోలీసులను చేతిలో పెట్టుకుని తనపై అక్రమ కేసులు నమోదు చేయించారని సాయి గణేష్ చెప్పారు. మీడియాతో మాట్లాడిన తర్వాత సాయి గణేష్ మరణించాడు.అయితే సాయి గణేష్ మరణించిన తర్వాత కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై బీజేపీ తీవ్రంగా మండిపడుతుంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం నాడు ఖమ్మంలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.
