తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో అన్ని లీకులే అని విమర్శించారు.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో అన్ని లీకులే అని విమర్శించారు. ఏ ఒక్క పరీక్ష సక్రమంగా నిర్వహించిన దాఖలాలు లేవని అన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌తో 30 లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇప్పుడు పదో తరగతి పరీక్షలతో పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పరీక్ష పేపర్ల లీకుల జాతర నడుస్తోందని విమర్శించారు. వరుస పేపర్ లీక్‌లకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
చదువుకు, పదవులకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ప్రధాని చదవుపై అనవసర చర్చ పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కొడుకు, కూతురు చదివిన చదువు.. లిక్కర్ దందా, డ్రగ్స్ దందా చేయాలని చెప్పిందా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాకముందు కేసీఆర్ ఎట్లున్నడు.. ఇప్పుడు ఎట్లున్నడో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ప్రతిపక్షాలకు డబ్బులుపెట్టే స్థాయికి కేసీఆర్ ఎలా వచ్చారని ప్రశ్నించారు. గతంలో బ్యాంకు లోన్‌లు కట్టలేని కేసీఆర్‌కు వేల కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో దేశంలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
