హైదరాబాద్‌లో నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి, జీహెచ్ఎంసీలో పేరుకుపోయిన అంతులేని అవినీతికి ఇది నిదర్శనమని అన్నారు. దీనికంతటికి తొలి ముద్దాయి సీఎం కేసీఆరే. నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడానికి కేసీఆర్ బాధ్యత వహిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆధారాల్లేకుండా 27 వేలకుపైగా బర్త్, 4 వేలకుపైగా డెత్ సర్టిఫికెట్లను జారీ చేయడం వెనుక ఆశ్యర్యం, ఆందోళన కలిగించే అంశముందని అన్నారు.
దేశాన్ని విభజించే కుట్రలో భాగంగానే నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలతో పాస్ పోర్టులు పొంది ఉగ్రవాదులు పాతబస్తీలోకి ప్రవేశిస్తున్నారని ఆరోపించారు. పాతబస్తీ ఐఎస్ఐ కేరాఫ్ గా మారిందని ఆరోపించారు. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా దాని మూలాలు పాతబస్తీలోనే ఉన్నాయని ఆరోపించారు. ఓట్లు, సీట్ల కోసం పాతబస్తీని ఎంఐఎంకు కేసీఆర్ అప్పగించారని విమర్శించారు. బీఆర్‌ఎస్, ఎంఐఎంలు కేంద్రంపై దుష్ప్రచారం చేసి అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.
టాస్క్ ఫోర్స్ దాడి చేసిన కొన్ని మీ సేవా కేంద్రాల్లోనే 31 వేల బర్త్, డెత్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. పాతబస్తీ మొత్తం జల్లెడ పడితే లక్షల్లో ఇలాంటి సర్టిఫికెట్లు బయటపడే అవకాశం ఉంది. వీటితోపాటు రేషన్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు కూడా పొంది పాతబస్తీ పౌరులుగా చలామణి అవుతూ హైదరాబాద్ సహా ప్రధాన నగరాలన్నింటిల్లో అల్లర్లు స్రుష్టించి భారతదేశాన్ని విచ్చిన్నం చేసేందుకు పెద్ద కుట్ర చేసినట్లు తెలుస్తోందని అన్నారు. తక్షణమే పాతబస్తీలో జారీ చేసిన బర్త్, డెత్ సర్టిఫికెట్లతోపాటు రేషన్ కార్డు, ఓటర్ కార్డులపై సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి, జీహెచ్ఎంసీలో పేరుకుపోయిన అవినీతికి నకిలీ సర్టిఫికెట్ కుంభకోణమే నిదర్శనమని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ ముద్దాయి అని అన్నారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై విచారణ జరిపి కిందిస్థాయి సిబ్బంది, అధికారులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వాస్తవాలు వెలుగులోకి రాకుండా చర్చను పక్కదారి పట్టించాలని యోచిస్తున్నారని అన్నారు. ఈ అంశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని బీజేపీ తేల్చిచెప్పింది. వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, నేతలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
