ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఈడీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకు సంబంధించి ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఈడీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకు సంబంధించి ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎస్‌పీఎస్సీ ముట్టడించిన ఘటనలో అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న బీజేవైఎం నేతలను బండి సంజయ్ ఈ రోజు పరామర్శించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలను జైలుకు పంపడం సర్వ సాధారణం అయిందని విమర్శించారు. తాము భయపడే వ్యక్తులం కాదని అన్నారు. ఢిల్లీలో కవితకు అంతా రెడీ అవుతుందని అన్నారు.
