కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతున్నారని చెప్పారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన చేరికకు సంబంధించి త్వరలోనే డేట్ ఖరారు అవుతుందని తెలిపారు.  

కాంగ్రెస్ (congress) సీనియర్ నేత , మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (komatireddy rajgopal reddy) బీజేపీలో (bjp) చేరనున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. తాజాగా దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) స్పందించారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని.. దీనిపై త్వరలోనే డేట్ ఖరారు అవుతుందని ఆయన అన్నారు. ఉప ఎన్నిక అంశం ఎన్నికల సంఘం చూసుకుంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణలో రాజగోపాల్ రెడ్డే కాకుండా రానున్న రోజుల్లో చాలా మంది బీజేపీలో చేరబోతున్నారని బండి సంజయ్ వెల్లడించారు. అటు బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ (etela rajender) సైతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికను స్వాగతించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎవరు బీజేపీలోకి వచ్చినా వారిని గెలిపించుకుంటామని ఈటల పేర్కొన్నారు. 

కాగా... Komatireddy Rajagopal Reddy కాంగ్రెస్ పార్టీని వీడే విషయమై ముఖ్య అనుచరుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. మండలాలవారీగా Congress పార్టీ ముఖ్య నేతలతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. నియోకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ముఖ్య నేతలతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇవాళ సంస్థాన్ నారాయణపురం, మునుగోడు మండలాలకర చెందిన నాయకుల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. .వారం రోజుల్లో తమ అభిప్రాయాలను చెప్పాలని కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారని సమాచారం.

ALso Read:అనుచరులతో చర్చలు: బీజేపీలో చేరేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొగ్గు

పార్టీ మార్పుతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయమై అభిప్రాయం చెప్పాలని ముఖ్యనేతలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచిస్తున్నట్టుగా సమాచారం. వారం లోపుగా అభిప్రాయాలు చెప్పాలని నేతలకు సూచించారు. పార్టీ మార్పు చారిత్రక అవసరమని ఈ నెల 24న ఆయన అన్నారు. ఈ విషయమై రాజగోపాల్ రెడ్డితో CLP నేత మల్లు భట్టి విక్రమార్క చర్చించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కూడా అదే రోజున చర్చలు జరిపారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారని సమాచారం. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించే శక్తి బీజేపీకే ఉందనే అభిప్రాయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగా కూడా చెప్పారు. GHMC, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను కూడా రాజగోపాల్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు.