Asianet News TeluguAsianet News Telugu

మహిళా నేతతో రాసలీలల వీడియో లీక్: బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిపై వేటు

 మహిళా నాయకురాలితో సన్నిహిత సంబంధాలు కరీంనగర్ లో బీజేపీ నేత పదవికి ఎసరు తెచ్చిపెట్టింది. ఈ సంబంధాలు బయటపడడంతో కొత్త నేతకు పదవిని కట్టబెట్టారు.

Bandi sanjay appointed Gangadi Krishna Reddy as new bjp president to karimnagar district lns
Author
Karimnagar, First Published Oct 2, 2020, 2:01 PM IST


కరీంనగర్:  మహిళా నాయకురాలితో సన్నిహిత సంబంధాలు కరీంనగర్ లో బీజేపీ నేత పదవికి ఎసరు తెచ్చిపెట్టింది. ఈ సంబంధాలు బయటపడడంతో కొత్త నేతకు పదవిని కట్టబెట్టారు.

బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా బాస సత్యనారాయణను  పార్టీ నాయకత్వం నియమించింది.ఆయనకు ఓ మహిళా నేతతో సాన్నిహిత్యం ఉంది. ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య వ్యవహారం బెడిసికొట్టింది.

వీరిద్దరి మధ్య ఆడియో, వీడియో సంభాషణ లీకైంది. ఈ విషయమై  బాస సత్యనారాయణను తొలగించి  గంగాడి కృష్ణాడిని నియమించింది బీజేపీ నాయకత్వం. జిల్లా అధ్యక్షుడి రాసలీలల వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్నాయి..

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం సత్యనారాయణను జిల్లా అధ్యక్ష పదవి నుండి తప్పించారు. జిల్లా అధ్యక్షుడి రాసలీలల వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం బయట పడడానికి పెద్ద కథే నడిచిందనే ప్రచారం సాగుతోంది.

పార్టీలోని మహిళా కార్యకర్తను లొంగదీసుకొన్నాడు. అవసరం వచ్చినప్పుడల్లా ఆ మహిళను తనకు నచ్చినన చోటికి పిలిపించుకొని ఏకాంతంగా గడిపేవాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది.  వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు.. వ్యవహారం బయటకు వచ్చింది.  గదిలో ఆ నాయకుడు నగ్నంగా ఉన్న వీడియోలు... తానను చెప్పిన చోటీకి రావాలంటూ ఫోన్ కాల్ ఆడియోను బయటపెట్టింది ఆమె.

ఈ విషయం పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఇద్దరికి పార్టీ నేతలు క్లాస్ తీసుకొన్నారు.  రూ. 15 లక్షలు కావాలని కోరితే రూ. 9 లక్షలకు విషయం సెటిల్ చేశారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయం మీడియాకు చేరింది. ఫోటోలు,వీడియోలు మీడియాకు అందాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ మహిళ ఇంటికెళ్లి ఈ ఫోటోలు, వీడియోలు ఉన్న ఫోన్ ను ఆయన తీసుకెళ్లినట్టుగా  ఆమె ఆరోపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios