Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ నూతన అడ్వోకేట్ జనరల్ గా బీఎస్ ప్రసాద్

తెలంగాణ ప్రభుత్వం నూతన అడ్వోకేట్ జనరల్ ని నియమించింది. హైకోర్టు సీనియర్ న్యాయవాది బండ శివానంద ప్రసాద్ ను నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత కొంత కాలంగా ఖాళీగా వున్న ఈ పోస్టు భర్తీ అయ్యింది. 
 
Banda Shivananda Prasad is new Advocate General of Telangana
Author
Hyderabad, First Published Aug 10, 2018, 5:42 PM IST

తెలంగాణ ప్రభుత్వం నూతన అడ్వోకేట్ జనరల్ ని నియమించింది. హైకోర్టు సీనియర్ న్యాయవాది బండ శివానంద ప్రసాద్ ను నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత కొంత కాలంగా ఖాళీగా వున్న ఈ పోస్టు భర్తీ అయ్యింది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర అడ్వోకేట్ జనరల్ గా దేశాయ్ ప్రకాశ్ రెడ్డిని నియమించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన తన పదవికి ఈ ఏడాది మార్చి 26 న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అతడి రాజీనామాను ఆమోదించిన ప్రభుత్వం అప్పటినుండి నూతన అడ్వోకేట్ జనరల్ కోసం వేట సాగించింది.

అయితే ప్రభుత్వం తరపున వాదించడానికి సీనియారిటీ తో బాగా మంచి ట్రాక్ రికార్డు ఉన్న న్యాయవాది కోసం ప్రభుత్వం వెదికింది. ఇలా దాదాపు నాలుగు నెలల తర్వాత ఎట్టకేలకు జనగామ వాసి బీఎస్ ప్రసాద్ ను ఎంపికచేసింది. ఇందుకోసం సీఎం కేసీఆర్ ఆమోదం తెలుపుతూ ఏజీ నియామక దస్త్రంపై సంతకం చేశారు. దీంతో అధికారులు నూతన ఏజీగా బీఎస్ ప్రసాద్ నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios