ఆస్పత్రి నుండి మరో శిశువు అపహరణ, రెండు గంటల్లోనే...

baby boy was kidnapped in adilabad rims hospital
Highlights

ఇటీవల హైదరాబాద్ లో చిన్నారి చేతన కిడ్నాప్ కేసును మరిచిపోకముందే ఇలాంటిదే మరో ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేవలం రెండు గంటల్లోనే కిడ్నాపర్ చెరనుండి శిశువును కాపాడి తల్లిఒడికి చేర్చారు.

ఇటీవల హైదరాబాద్ లో చిన్నారి చేతన కిడ్నాప్ కేసును మరిచిపోకముందే ఇలాంటిదే మరో ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేవలం రెండు గంటల్లోనే కిడ్నాపర్ చెరనుండి శిశువును కాపాడి తల్లిఒడికి చేర్చారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో నార్నూర్ మండలం చోర్‌గామ్ గ్రామానికి చెందిన మమత అనే మహిళ మగ  ఈ నెల 7న శిశువుకు జన్మనిచ్చింది. అయితే గత రాత్రి ఆ బిడ్డను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశాడు. దీన్ని గుర్తించిన కుటుంబసభ్యులు డాక్టర్లు దృష్టికి తీసుకెళ్లగా వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శిశువు కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

అయితే నగరంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఓ మహిళ యువకుడితో కలిసి చిన్నారిని ఎత్తుకుని వెళుతుండడాన్ని గమనించారు. దీంతో ఆమెపై అనుమానంతో ఆపి ఆరా తీయగా తన పేరు పుష్ప అని, రిమ్స్ ఆస్పత్రిలో బిడ్డను కన్నానని అక్కడి నుండే వస్తున్నానని సమాధానం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆస్పత్రికి ఫోన్ చేసి కనుక్కోగా ఆ పేరుతో ఎవరు ఆస్పిటల్లో ప్రసవించలేదని చెప్పారు. 

దీంతో ఆమెను తమ పద్దతితో పోలీసులు విచారించగా అసలు నిజాన్ని చెప్పింది. ఈ బిడ్డను కిడ్నాప్ చేసినట్లు తెలిపింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి చిన్నారిని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇలా కేవలం రెండు గంటల్లోనే కిడ్నాపైన చిన్నారిని తల్లి ఒడికి చేర్చారు.

అయితే కిడ్నాఫర్ పుష్పలత గతంలో ఈ రిమ్స్ ఆస్పత్రిలోనే ఏఎన్ఎం గా శిక్షణ తీసుకుంది. దీంతో ఆ ఆస్పత్రికి వెళ్లు దారులు, వార్డులు అన్నీ ఆమెకు తెలుసు. దీంతోనే సెక్యూరిటీ కళ్లుగప్పి ఇంత సులభంగా శిశువును అపహరించగలిగిందని పోలీసులు తెలిపారు. కానీ చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలు కావాల్సి వచ్చింది.
 

loader