భద్రాచలం: తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో  బుధవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి భూమిపూజ బుధవారం నాడు నిర్వహిస్తున్నందున భద్రాచలంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు..స్థానాచార్యుడు స్థలసాయి. ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యుల నేతృత్వంలో బేడా మండపంలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

also read:అయోధ్యను సందర్శిస్తున్న తొలి ప్రధాని మోడీ: యూపీ ప్రభుత్వం

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమ గుండంలో హోం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తి కావాలని హోమం నిర్వహించినట్టుగా  పూజారులు తెలిపారు.ప్రతి ఏటా శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఈ ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 

అయితే కరోనా కారణంగా ఈ ఏడాది సీతారామకళ్యాణోత్సవానికి భక్తులను అనుమతించలేదు. అర్చకులు, అధికారులకు మాత్రమే అవకాశం కల్పించారు. భక్తులు లేకుండా సీతారాముల కళ్యాణం జరగడం బహుశా ఈ ఆలయ చరిత్రలో ఇదే తొలిసారిగా ఆలయ వర్గాలు తెలిపాయి.

భద్రాచలంలో సీతారాములు తిరిగినట్టుగా స్థానికుల నమ్మకం. అందుకే ఈ ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ప్రతి ఏటా ఇక్కడ జరిగే సీతా రాముల కళ్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరౌతారు.