Asianet News TeluguAsianet News Telugu

ఆటోలో అత్యాచారం.. ప్రయాణికురాలిపై డ్రైవర్ మరో వ్యక్తితో కలిసి...

సోమవారం రాత్రి ఆమె పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. కొద్ది దూరం వెళ్లగానే ఆటో డ్రైవర్ దారి మార్చి జల్ పల్లి కార్గో రోడ్డుకు తీసుకొచ్చాడు. auto driver తో పాటు మరో వ్యక్తి కలిసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నం చేశారు. 

auto driver raped a woman passenger in pahadi shareef, hyderabad
Author
Hyderabad, First Published Nov 10, 2021, 8:08 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పహాడీ షరీఫ్ : ఆటో ఎక్కిన ఓ ప్రయాణికురాలిపై డ్రైవర్ మరో వ్యక్తితో కలిసి అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఫలక్ నుమా వట్టెపల్లికి చెంిన మహిళ (35) కాటేదాన్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.

సోమవారం రాత్రి ఆమె పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. కొద్ది దూరం వెళ్లగానే ఆటో డ్రైవర్ దారి మార్చి జల్ పల్లి కార్గో రోడ్డుకు తీసుకొచ్చాడు. auto driver తో పాటు మరో వ్యక్తి కలిసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నం చేశారు. 

దేశీ దాబా సమీపంలోకి రాగానే ఆమె కేకలు వేయడంతో ఆమెను అక్కడ దింపేసి పరారయ్యారు. మంగళవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఆటో నంబర్ వివరాలు చెప్పలేకపోవడంతో పోలీసులు cargo roadలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. 

స్నేహితుడి భార్యపై అత్యాచారం..
హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో రెండు రోజుల క్రితం దారుణం జరిగింది. స్నేహితుడి భార్య మీద కన్నేసి, బెదిరించి ఆమె మీద పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.. గాజుల రామారంలోని నెహ్రూ నగర్ కు చెందిన ప్రశాంత్ జీడిమెట్ల భాగ్యలక్ష్మీ కాలనీలో ఉంటున్న స్నేహితుడి ఇంటికి తరచూ వెల్తుండేవాడు.

భర్త మరణం, వేరొకరితో సహజీవనం.. పెళ్లికి ఒత్తిడి తెచ్చిందని, ఫలక్‌నుమా డ్యాన్సర్ హత్య కేసులో వీడిన మిస్టరీ

ఈ క్రమంలో friend భార్య మీద ప్రశాంత కన్ను పడింది. ప్రేమిస్తున్నానని అంగీకరించకపోతే చచ్చిపోతానని, లేదంటే చంపేస్తానని బెదిరించి ఆమె మీద rapeకు ఒడిగట్టాడు. విషయాన్ని ఎక్కడైనా చెబితే ఆమెను, ఆమె పిల్లలు, భర్తను చంపేస్తానని బెదిరించాడు.

తన వద్ద వీడియోలున్నాయని, వాటిని అందరికీ పంపిస్తానని Threatening పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె వద్ద ఉన్న రూ.16 లక్షలు తీసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

చివరికి victim పేట్ బహీరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్నానన్న పోలీసులు ప్రశాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

ప్రేమోన్మాది ఘాతుకం...
పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. రామగుండం కేకే నగర్ కాలనీలో పెళ్లికి నిరాకరించందనే అక్కసుతో ప్రియురాలిని గొంతుకోసి హత్యచేశాడో ప్రేమోన్మాది. కెకె నగర్‌కు చెందిన గొడుగు అంజలి అనే యువతి తారకరామారావు నగర్‌కు చెందిన చాట్ల రాజు అనే యువకుడు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. 

అంజలిని marriage చేసుకోవాలంటూ రాజు వేధింపులకు గురిచేయటంతో రెండు సార్లు పంచాయతీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో రాజు ఇంట్లో చోరబడి anjaliని  కత్తిపీటతో గొంతు కోసి హత్య చేశాడు. దీంతో అంజలి అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios