హైదరాబాద్ జీడిమెట్లలో సంచలనం రేపిన ఆటో డ్రైవర్ హత్య కేసులో భార్యను, ఆమెకు సహకరించి మైనర్ బాలికను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆటో డ్రైవర్ హత్య కేసు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అతడి మెడకు చున్నీతో ఉరి బిగించి హత్య చేసిన భార్యను, ఆమెకు సహాయం చేసిన మైనర్ బాలికను జీడిమెట్ల పోలీసులు బుధవారం రిమాండ్కు తరలించారు. ఈ మేరకు కేసు వివరాలను సీఐ పవన్ ఈ విధంగా తెలియజేశారు.. 

హైదరాబాదులోని సంజయ్ గాంధీ నగర్ లో నివసించే సంతోష్ (28), రేణుక (24)లది ప్రేమ వివాహం. 2016 లో వీరిద్దరూ ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. సురేష్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా రేణుక గృహిణి. పెళ్లయిన ఏడాది తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, రేణుక వ్యసనాలకు అలవాటుపడింది. దీంతో ఆమె తరచుగా కల్లు దుకాణానికి వెళ్లేది. నిత్యం అక్కడికి వెళుతూ ఉండడంతో అక్కడికి వచ్చిన ఓ అనాధ బాలిక దుండిగల్ తాండాకు చెందిన మైనర్ పరిచయమైంది. ఆమెనుతనతో పాటు ఇంటికి తీసుకువచ్చింది.

ఈ క్రమంలోనే ఈనెల 6వ తేదీ రాత్రి సురేష్, రేణుకలు గొడవపడ్డారు. తాను చేసే ప్రతీపనికి అడ్డుగా ఉన్నాడని అతడి అడ్డు తొలగించుకోవాలనుకున్న రేణుక…ఆ రోజు రాత్రి భర్తకు పుల్దుగా మద్యం తాగించి, మైనర్ బాలిక సహాయంతో మెడకు చిన్ని ఉరి బిగించి హతమార్చింది. ఆ తరువాత బిల్డింగ్ మీదకి తీసుకువెళ్లి కిందికి తోసేశారు. ఎవరో చంపేశారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు భార్య రేణుక, బాలికను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఆటోడ్రైవర్ మర్డర్ మిస్టరీ.. భర్తకు ఉరేసి చంపి.. మటన్, మల్లెపూలు తెమ్మంటే.. ఎవరో హత్య చేశారంటూ డ్రామా..

ఇదిలా ఉండగా, ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే భర్తకు ఆ 17యేళ్ల బాలికతో రహస్యంగా పెళ్లి కూడా చేయడం. కాగా, బాలికతో పెళ్లి చేసిన తర్వాత.. భర్త బాలికకు దగ్గరవ్వడం రేణుకకు నచ్చలేదు. అంతేకాదు బాలికకు దగ్గరైన సురేష్.. చెడు వ్యసనాలకు బానిసైన భార్యను వదిలించుకోవాలని పథకాలు వేశాడు. ఇది రేణుకకు తెలిసింది. దీంతో అదే బాలికతో కలిసి అతడిని దారుణంగా హత్య చేసింది. 

హైదరాబాద్ జీడిమెట్లలోని సంజయ్ గాంధీ నగర్ లో సోమవారం నాడు వెలుగుచూసిన ఆటో డ్రైవర్ హత్య కేసులో అసలు వాస్తవాలు ఇవి. భార్య రేణుకకు కొద్ది రోజుల క్రితం బహుదూర్ పల్లిలోని ఒక కల్లు దుకాణం దగ్గర దుండిగల్ తండాకు చెందిన అనాధ బాలికతో పరిచయమైంది. అలా వరసగా 15 రోజులపాటు ఆమెను గమనించిన రేణుక, ఆ తర్వాత ఇంటికి తీసుకువచ్చి, భర్తకు ఇచ్చి పెళ్లి చేసింది. అయితే, పెళ్లి తర్వాత బాలికకు దగ్గరైన సురేష్.. భార్యను వదిలించుకోవాలని చూశాడు. 

ఈ విషయం భార్యకు తెలిసి.. గొడవలు మొదలై అవి చివరికి హత్యకు దారి తీశాయి. ఆదివారం రాత్రి సురేష్, రేణుక, రెండో పెళ్లి చేసుకున్న బాలిక ముగ్గురు కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత మధ్య మధ్యలో సురేష్ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే రేణుక బాలికతో కలిసి అతని మెడకు శాలువాను బిగించి.. ఆటో ఒకరు ఇటు ఒకరు కలిసి గట్టిగా లాగారు. దీంతో సురేష్ ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.