Asianet News TeluguAsianet News Telugu

యూట్యూబ్‌లో చూసి.. ఓఎల్‌ఎక్స్‌లో కలర్ ప్రింటర్ కొని, నకిలీ నోట్ల తయారీ

ఓ వ్యక్తి యూట్యూబ్‌లో నకిలీ నోట్లను ఎలా తయారు చేయాలో నేర్చుకుని జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పఠాన్‌చెరువు జేపీ కాలనీకి చెందిన ఉప్పరి రాజుప్రసాద్‌ అలియాస్‌ రాజు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగ నోట్ల చెలామణిలోకి దిగాడు. 

auto driver arrest at kukatpalli for fake notes case ksp
Author
Hyderabad, First Published Jun 18, 2021, 4:50 PM IST

వినోదం కోసం, తెలియని విషయాలు తెలియడం కోసం లేదంటే వీడియో షేరింగ్ ద్వారా ఆదాయం సంపాదించేందుకు ఉపయోగించాల్సిన యూట్యూబ్‌ను ఇటీవల కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. తుపాకులు, బాంబ్‌లు తయారు చేయడానికి హత్యలు, దోపిడి చేసేందుకు ఉపయోగిస్తున్నారు. యూట్యూబ్‌లో చూసి వీటిని నేర్చుకుంటున్నారు. 

తాజాగా ఓ వ్యక్తి యూట్యూబ్‌లో నకిలీ నోట్లను ఎలా తయారు చేయాలో నేర్చుకుని జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పఠాన్‌చెరువు జేపీ కాలనీకి చెందిన ఉప్పరి రాజుప్రసాద్‌ అలియాస్‌ రాజు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగ నోట్ల చెలామణిలోకి దిగాడు. 

Also Read:పీకల్లోతు ఆర్ధిక కష్టాలు: తప్పించుకునేందుకు దంపతుల ఎత్తు, ఇంట్లో నోట్ల ముద్రణ...

పఠాన్‌ చెరువు, మండవల్లి, ఏలూరు, బాచుపల్లి, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో దొంగనోట్లు చెలామణి చేస్తూ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. విడుదలయ్యాక కూడా ప్రవర్తన మార్చుకోకుండా రాజుప్రసాద్‌ ఓఎల్‌ఎక్స్‌లో కలర్‌ ప్రింటర్‌ కొనుగోలు చేసి, దానిని ఉపయోగించి రెండు వేల రూపాయల నోట్లు ముద్రించాడు. ఈ నేపథ్యంలో ఇస్నాపూర్‌లోని ఓ పాదరక్షల దుకాణంలో నోటును మార్చిన రాజు అనంతరం కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హోటల్‌లో నకిలీ నోట్లు మారుస్తుండగా పట్టుబడ్డాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రాజు దగ్గర నుంచి 14 నకిలీ రెండువేల రూపాయల నోట్లు, కలర్‌ ప్రింటర్‌ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios