Asianet News TeluguAsianet News Telugu

పీకల్లోతు ఆర్ధిక కష్టాలు: తప్పించుకునేందుకు దంపతుల ఎత్తు, ఇంట్లో నోట్ల ముద్రణ...

వరంగల్‌లో దొంగ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. గత కొంతకాలంగా జిల్లాలో 100, 50, 20 రూపాయల దొంగ నోట్లు చెలామణి అవుతున్నాయి. నగరంలో రెండు రోజుల కిందట 50 రూపాయల దొంగనోట్ల చెలామణి విషయం వెలుగుచూసింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ కమీషనర్ తరుణ్ జోషి.. దొంగనోట్ల ముఠా ఆటకట్టించి అరెస్ట్ చేయించారు.

fake currency gang arrested in warangal ksp
Author
Warangal, First Published Jun 2, 2021, 3:55 PM IST

వరంగల్‌లో దొంగ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టును రద్దు చేశారు పోలీసులు. గత కొంతకాలంగా జిల్లాలో 100, 50, 20 రూపాయల దొంగ నోట్లు చెలామణి అవుతున్నాయి. నగరంలో రెండు రోజుల కిందట 50 రూపాయల దొంగనోట్ల చెలామణి విషయం వెలుగుచూసింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ కమీషనర్ తరుణ్ జోషి.. దొంగనోట్ల ముఠా ఆటకట్టించి అరెస్ట్ చేయించారు. వారి నుంచి 10 లక్షల నకిలీ నోట్లతో పాటు ప్రింటర్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

అయితే వరంగల్ నగరంలో నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్‌లో చెలామణి చేస్తున్న దంపతులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.10,09,960 నకిలీ కరెన్సీని పోలీసులు సీజ్ చేశారు. కరెన్సీని ముద్రించేందుకు వినియోగిస్తున్న కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లు, ఒక కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు  పోలీసులు. వరంగల్ కాశీబుగ్గ తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన వంగరి రమేశ్ , వంగరి సరస్వతి దంపతులు కాశీబుగ్గ ప్రాంతంలోనే చికెన్ సెంటర్‌తో పాటుగా ఫ్యాన్సీ షాప్, మ్యారేజ్ బ్యూరో నిర్వహించేవారు.

Also Read:ఎటిఎంలో నకిలీ నోట్ వచ్చిందా? అయితే వెంటనే ఏం చేయాలో తెలుసుకోండి..

ఈ క్రమంలో వారికి ఆర్ధిక ఇబ్బందులు రావడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో, ఈ కిలాడి దంపతులు అనుకున్నదే తడవుగా నకిలీ నోట్లను ముద్రించి వాటిని రద్దీ ప్రాంతాల్లో చెలామణి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో వున్న స్కానర్‌తో కూడిన కలర్ ప్రింటర్‌తో పాటు కరెన్సీకి అవసరమైన బాండ్ పేపర్లను కొని.. గత మూడు నెలలుగా అసలు కరెన్సీకి సంబంధించిన రూ.2000, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 కొత్త, పాత నోట్లను ముందుగా స్కానర్‌తో స్కాన్ చేశారు. తర్వాత స్కాన్ చేసిన నోట్లను  కలర్ ప్రింటర్ ద్వారా నకిలీ కరెన్సీగా ముద్రించేవారు.

అనంతరం నకిలీ కరెన్సీని ఎవరికీ అనుమానం రానివిధంగా నోట్లను రూపొందించి హన్మకొండ, వరంగల్‌లో రద్దీగా వుండే షాపుల్లో చెలామణి చేసేవారు. అయితే కొద్దిరోజులుగా వరంగల్‌లోని షాపుల్లో నకిలీ నోట్ల చెలామణి అవుతున్నట్లుగా పలు ఫిర్యాదులు రావడంతో పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమీషనరేట్ టాస్క్‌ఫోర్స్, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసులకు అందిన సమాచారం మేరకు నకిలీ కరెన్సీని ముద్రిస్తున్న ఇంటిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, దంపతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios