Asianet News TeluguAsianet News Telugu

14యేళ్ల బాలుడిపై మేనత్త లైంగిక దాడి.. వీడియో తీసి బ్లాక్ మెయిల్...

పద్నాలుగేళ్ల వయసున్న మేనల్లుడిని లొంగదీసుకుంది ఓ మేనత్త. ఆ బాలుడితో  లైంగిక వాంఛలు తీర్చుకుంటూ ఆ దృశ్యాలను వీడియో రికార్డింగ్ చేసింది. ఆ తరువాత బ్లాక్ మెయిల్ చూస్తే 20 తులాల బంగారు నగలు.. రూ.6 లక్షల నగదును బలవంతంగా వసూలు చేసింది. ఈ దారుణమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. 

aunty molestation minor boy and blackmail in banjara hills, hyderabad
Author
Hyderabad, First Published Dec 3, 2021, 7:43 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బంజారా హిల్స్ : వావి వరసలు అంతమవుతున్నాయి. డబ్బుకోసం, శారీరక సుఖం కోసం ఎం నీచానికైనా దిగజారడానికి సిద్ధమవుతున్నారు. చిన్నారుల్నీ వదలడం లేదు. దీనికి ఆడా,మగా తేడా లేకుండా పోతోంది. అల్లారుముద్దుగా అల్లుడిని చూసుకోవాల్సిన ఓ మేనత్తే అతని పాలిట కామ పిశాచిగా మారింది. పద్నాలుగేళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి లొంగదీసుకుంది. అదంతా వీడియో తీసి.. డబ్బు, నగల కోసం బ్లాక్ మెయిల్ మొదలుపెట్టింది. ఛీ.. అనిపించే ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో వెలుగులోకి వచ్చింది. 

పద్నాలుగేళ్ల వయసున్న మేనల్లుడిని లొంగదీసుకుంది ఓ మేనత్త. ఆ బాలుడితో Physical desires తీర్చుకుంటూ ఆ దృశ్యాలను వీడియో రికార్డింగ్ చేసింది. ఆ తరువాత Blackmail చూస్తే 20 తులాల బంగారు నగలు.. రూ.6 లక్షల నగదును బలవంతంగా వసూలు చేసింది. ఈ దారుణమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. 

ముగ్గురు పిల్లల తల్లిపై లైంగిక వేధింపులు... సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య (వీడియో)

పోలీసుల సమాచారం మేరకు జూబ్లీహిల్స్ రోడ్ నం. 10లోని గాయత్రీహిల్స్ లో నివసించే ఓ మహిళ ఇంట్లో ఇటీవల బంగారు నగలు దొంగతనం అయ్యాయి. అలమారాలో ఉండాల్సిన నగలు కనిపించకపోవడంతో ఆమె గాలిస్తున్న సయమంలో తొమ్మిదో తరగతి చదువుతున్న కొడుకు (14) తాను మేనత్తకు ఒక నెక్లెస్ ఇచ్చానని చెప్పాడు. 

ఎందుకు ఇచ్చావంటూ తల్లి ప్రశ్నించగా బెంగళూరులో నివసించే auntie తన బాయ్ ఫ్రెండ్ ఇర్ఫాన్ తో కలిసి హైదరాబాద్ కు వచ్చి చార్మినార్ సమీపంలోని ఓ లాడ్జ్ లో ఉండేదని చెప్పాడు. తాను చదువుతున్న school కు వచ్చి తనతో పాటు తీసుకెళ్లేదని చెప్పాడు. 

అక్కడినుంచి తనను Lodgeకి తీసుకువెళ్లేదని అక్కడ తనతో లైంగిక వాంఛలు తీర్చుకునేదని చెప్పాడు. అంతేకాదు ఆ సమయంలో ఆమె మాజీ భర్త ఇర్ఫాన్ ఈ దృశ్యాలను వీడియో తీసేవాడని.. ఎవరికైనా ఈ విషయం చెబితే వీడియోలు బయటపెడతానంటూ బెదిరించేవాడని.. ఇలా మూడుసార్లు తనను లాడ్జీకి తీసుకెళ్లిందని చెప్పాడు. 

కోడి గుడ్లు పెడుతుందని చూడడానికి వెళ్లి.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. కానిస్టేబుల్ నిర్వాకం...

ఆ తరువాత ఇటీవల తన వీడియో చూపిస్తూ బ్లాక్ మెయిల్ కు దిగిందని తెలిపాడు. బంగారు ఆభరణాలతో పాటు రూ. 6 లక్షలు తీసుకురాకపోతే వీడియో బటయపెడతామంటూ Threatening మొదలుపెట్టినట్టు చెప్పుకొచ్చాడు. దీంతో ఏం చేయాలో తెలీక దొంగతనం చేసి అత్తకు ఇచ్చినట్టు చెప్పాడు. బాలుడు చెప్పేది విని ముందుగా షాక్ అయిన తల్లి.. వెంటనే తేరుకుని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితురాలితో పాటు ఆమె మాజీ భర్తపై ఐపీసీ సెక్షన్‌ 384, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దగ్గరి బంధువు, మేనత్తే ఇలా చేయడంతో బాలుడి కుటుంబం షాక్ లో ఉంది. బాలుడి పట్ల ఇలా చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios