Asianet News TeluguAsianet News Telugu

ముగ్గురు పిల్లల తల్లిపై లైంగిక వేధింపులు... సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య (వీడియో)

పెళ్లయి ముగ్గురు పిల్లలున్న వివాహితపై సొంత బావే లైంగిక వేధింపులకు దిగాడు. ఈ వేధింపులు తట్టుకోలేక వివాాహిత సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న దారుణం కరీంనగర్ లో చోటుచేసుకుంది. 

married Woman Commits Suicide After Being Sexually Harassed By his brother in law In karimnagar
Author
Karimnagar, First Published Dec 2, 2021, 5:55 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరీంనగర్: ఆర్థిక కష్టాలున్నా ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న వివాహిత లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి వివరిస్తూ సెల్పీ వీడియో తీసుకుని వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.  

karimnagar పట్టణంలోని కాపువాడలో భార్యాపిల్లలతో కలిసి అరుణ నివాసముంటోంది. ఆర్థికంగా బలంగా లేకపోవడంతో కుటుంబానికి ఆసరాగా వుంటుందని బట్టలు కుడుతుండేది. ఇలా ఎంతో ఆత్మగౌరవంతో బ్రతుకున్న ఆమెపై సొంత బావ కనకయ్య కన్నేసాడు.  

కుటుంబ ఆర్థిక కష్టాలను ఆసరాగా చేసుకుని సాయంపేరుతో అరుణకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు బావ కనకయ్య. అయితే అతడి ఉద్దేశ్యాన్ని గుర్తించిన ఆమె దూరంపెట్టింది. దీంతో బరితెగించిన ఆ నీచుడు భర్త, పిల్లలు బయటకువెళ్లి ఇంట్లో ఒంటరిగా వున్న సమయంలో అరుణ వద్దకు వచ్చి లైంగికంగా వేధించేవాడు. 

read more  కోడి గుడ్లు పెడుతుందని చూడడానికి వెళ్లి.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. కానిస్టేబుల్ నిర్వాకం...

ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అరుణ లొంగకపోవడంతో క్యారెక్టర్ ను బ్యాడ్ చేస్తానని బెదిరించేవాడు. సొంత పిల్లలే నిన్ను అసహ్యించుకునేలా చేస్తానని ఆమెను బెదిరించడంతో తట్టుకోలేకపోయింది. ఇక తనను గౌరవంగా బ్రతకనివ్వడని భావించి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్పీ వీడియో రికార్డ్ చేసి బాధిత వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 

''పరువు పోతుందని చనిపోవడానికి సిద్ధమయ్యాను.  పిల్లలకి అన్యాయం చేసి పోతున్నాను. ఎవరి జోలికి పోకుండా జాగ్రత్తగా బతకండి'' ఆ తల్లి ఆవేదనతో పిల్లలకు చెప్పిన చివరి మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.   

ఇలా తనపై బావ కనకయ్య లైంగిక వేధింపులు, తాను అనుభవించిన మనోవేధన గురించి వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసుకోవడమే కాదు సూసైడ్ లెటర్ రాసిపెట్టి అరుణ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.  

వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివాహిత మరణానికి కారణమైన కనకయ్య కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

read more  ఉద్యోగం తెచ్చుకొమ్మంటే ఉరేసుకుని చనిపోయారు... ప్రేమజంట దారుణం...

ఇదిలావుంటే ఓ ఆకతాయి వేధింపులను తట్టుకోలేక యువతి బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్న దారుణం యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో స్నేహితులను వెంటేసుకుని ఓ ఆకతాయి వెంటపడుతూ వేధిస్తుండటాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది.  

yadadri bhuvanagiri district మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి చెందిన దుర్గాభవాని(17) భువనగిరి పట్టణంలో ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే ఈ యువతి ఇంటిపక్కనే వుండే గురజాల ఏలేందర్ ప్రేమ పేరిట వెంటపడేవాడు. అతడి ప్రేమను అంగీకరించకపోవడంతో స్నేహితులతో కలిసి యువతి వెంటపడుతూ వేధించసాగాడు. 

దీంతో మనోవేదనకు గురయిన దుర్గాభవాని ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో మరింత మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ కు తరలించారు. గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ దుర్గాభవాని మృతిచెందింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios