ఆ ఆడియో ఫేక్.. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి, పరీక్షించాలి.. పాడి కౌశిక్ రెడ్డి
తాను మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో ఫేక్ అని.. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తన మీద వస్తున్నఆరోపణల మీద స్పందించారు. తాను మాట్లాడినట్లుగా ఒక నకిలీ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని.. దాన్ని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారన్నారు. ఆడియో రికార్డు ఫేక్ అని తెలిపారు. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరీక్షించాలని కోరారు. అంతేకాదు, ఇలా పనిగట్టుకుని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేస్తానన్నారు.
టిఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ తో కలిసి కౌశిక్ రెడ్డి సోమవారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సామాజిక వర్గానికి నిజాలు ఏంటో తెలియాలి. కొంతమంది హుజురాబాద్ నియోజకవర్గంలో నాకు వస్తున్న ఆదరణ చూసి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. ముదిరాజ్ లకు నన్ను దూరం చేయాలని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఆ నకిలీ ఆడియోతో ముదిరాజ్ ల మనోభావాలు దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా’ అన్నారు.
ప్రేమ పేరుతో ఒకడు.. బ్లాక్ మెయిల్ చేసి మరో ఇద్దరు.. పదో తరగతి విద్యార్థినిపై ..
ఇదిలా ఉండగా జూన్ 12వ తేదీన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రవాహం ప్రమాదానికి గురైంది. శంకరపట్నం మండలం తాటికల్ శివారులో కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం బైక్ ను తప్పించబోయి, అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలోనే వాహనం రోడ్డు పక్కకు దూసుకుపోవడంతో.. కారులోని ఎయిర్ బెలూన్ ఓపెన్ అయింది. దీనివల్ల కౌశిక్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
కౌశిక్ రెడ్డి ఈ ప్రమాదంలో తృటిలో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మరో వాహనంలో కౌశిక్ రెడ్డి హుజురాబాద్ వెళ్లారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న టూకే రన్ లో పాల్గొనేందుకు కరీంనగర్ వైపు నుంచి హుజురాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.