ప్రేమ పేరుతో ఒకడు.. బ్లాక్ మెయిల్ చేసి మరో ఇద్దరు.. పదో తరగతి విద్యార్థినిపై ..
పదో తరగతి బాలికను బెదిరించి వేర్వేరు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఐదుగురిపై పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదైంది.
మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రభుత్వం కఠినతర చట్టాలను తీసుకవచ్చిన అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా కరీంనగర్ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికను ఓ ప్రేమ పేరుతో నమ్మించి తన కామవాంఛ తీర్చుకోగా.. ఆ దారుణానికి సంబంధించిన ఫోటోలను అడ్డుపెట్టుకుని అతని స్నేహితులు ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేసి.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ పట్టణంలోని ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. ఆ బాలిక నివసిస్తున్న ప్రాంతంలో ఉండే ఇంటర్ చదివే బాలుడుతో పరిచయం ఏర్పడింది. ఆ బాలుడు ప్రేమ పేరుతో ఆ బాలికను నమ్మించాడు. సుమారు ఏడాది కిందట ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఈ సందర్భంలో ఆ బాలుడి స్నేహితులు వారి సన్నిహిత ద్రుష్యాలను రహస్యంగా చిత్రీకరించారు
అనంతరం .. ఆ వీడియోలను, ఫోటోలను చూపుతూ..తల్లిదండ్రులకు చెబుతామని ఆ బాలికను బెదిరించారు. తమ మాట వినకపోతే.. దారుణంగా ఉంటుందని బాలికను లొంగదీసుకున్నారు. పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసిన వారి స్నేహితులైన మరో ముగ్గురు ఆ బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బాలిక దైర్యం చేసి..షీటీమ్ దృష్టికి తీసుకెళ్లింది. తొలుత అఘాయిత్యానికి పాల్పడిన వారిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు.
ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఇలా ఫిర్యాదు చేయడంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో బాలిక ప్రేమికుడితో పాటు మరో ఐదుగురిపై పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదైంది. కేసు నమోదైన ఆరుగురిలో అయిదుగురు మైనర్లు కాగా.. ఒకరు మేజర్ అని పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపారు.