భోపాల్, హైద్రాబాద్ లలో డ్రోన్లతో దాడులకు ప్లాన్: ఉగ్ర నిందితుల కేసులో కీలక విషయాలు
భోపాల్, హైద్రాబాద్ లలో డ్రోన్ల ద్వారా దాడులు చేయాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
హైదరాబాద్: డ్రోన్ల ద్వారా దాడులకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేయాలని నిందితులు ప్లాన్ చేశారు. మధ్యప్రదేశ్ ఏటీఎస్, హైద్రాబాద్ పోలీసుల సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో 17 మందిని అరెస్ట్ చేశారు. హైద్రాబాద్, భోపాల్ లో డ్రోన్ల ద్వారా దాడులు చేయాలని నిందితులు ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్ ఏటీఎస్ , తెలంగాణ పోలీసులు హైద్రాబాద్ లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. హైద్రాబాద్ లో 17 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టై న వారిలో 11 మంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. మిగిలిన ఆరుగురు హైద్రాబాద్ వాసులు. ఈ 17 మందిని భోపాల్ తరలించి విచారిస్తున్నారు పోలీసులు.
హైద్రాబాద్, భోపాల్ లలో డ్రోన్ల ద్వారా దాడులు చేయాలని నిందితులు ప్లాన్ చేశారని సమాచారం. మరో వైపు పేలుదు పదార్థాల తయారీ, తుపాకుల వినియోగంపై అనంతగిరి గుట్టల్లో నిందితులు శిక్షణ పొందారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. హైద్రాబాద్ లో ఉంటున్న వీరిపై దర్యాప్తు సంస్థలు చాలా కాలంగా నిఘాను ఏర్పాటు చేశాయి.
హైద్రాబాద్ కు చేరుకున్న ఏటీఎస్ టీమ్ పాతబస్తీలో ఉంటున్న వీరి గురించి సమాచారం ఇచ్చింది. వీరికి సంబంధించిన సమాచారాన్ని కౌంటర్ ఇంటలిజెన్స్ కూడా ఏటీఎస్ తో పంచుకుంది. రెండు రోజుల క్రితం 16 మందిని అరెస్ట్ చేశారు. నిన్న ఒకరు అరెస్టయ్యారు.
షాపింగ్ మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలు వంటి జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాడులు చేయాలని నిందితులు ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు గుర్తించినట్టుగా ప్రచారం సాగుతుంది. మాల్స్ వంటి వాటిని తమ ఆధీనంలోకి తీసుకొని భయబ్రాంతులకు గురిచేయాలని ప్లాన్ చేశారని సమాచారం. కనీసం రెండు రోజుల పాటు అన్నం, నీళ్లు లేకుండా ఉండే విషయంలో కూడా వీరంతా శిక్షణ పొందారని తెలుస్తుంది. యూట్యూబ్ లలో వీడియోలు చూసి ఈ విషయమై నిందితులు ఫిట్ నెస్ శిక్షణ పొందారని నిఘా వర్గాలు గుర్తించాయి.
also read:ఉగ్రమూలాలపై ఏటీఎస్ సోదాలు: హైద్రాబాద్ లో మరొకరు అరెస్ట్
మరో వైపు కీ ఆఫ్ రైట్ పాత్ అనే పేరుతో యూట్యూబ్ చానల్ ను కూడా నిర్వహించారని నిఘా వర్గాలు గుర్తించాయి. గోల్కోండలో నివాసం ఉంటున్న సలీం నివాసంలో బయాన్ పేరుతో నిందితులు తరచుగా సమావేశాలు నిర్వహించినట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.