Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ వేదికగానే బీఆర్ఎస్ విస్తరణ వ్యూహాలు.. నెలాఖరులో కేసీఆర్ ప్రెస్‌మీట్, విధివిధానాలు ప్రకటించే ఛాన్స్

బీఆర్ఎస్ పార్టీని విస్తరించే ప్రణాళికలను తెలంగాణ సీఎం కేసీఆర్ వేగవంతం చేశారు. దీనిలో భాగంగా ఈ నెలాఖరులో ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి, విధివిధానాలను ప్రకటించే ఛాన్స్ వుంది. 

telangana cm kcr key press meet in delhi on december ending
Author
First Published Dec 20, 2022, 6:27 PM IST

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలాఖరులో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. క్రిస్మస్ తర్వాతి నుంచి దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నెలలోనే బీఆర్ఎస్ విధివిధానాలను ప్రకటించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. నెలాఖరుకల్లా 6 రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కిసాన్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కిసాన్ సెల్ కమిటీలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. 

ఇదిలావుండగా.... కేసీఆర్ గత వారం దాదాపు 4 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు .. రాజశ్యామల యాగం  నిర్వహించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌‌‌‌లతో కేసీఆర్ చర్చలు జరిపారు. అలాగే వివిధ రైతు సంఘాల నాయకులతో కేసీఆర్ సుధీర్ఘంగా మంతనాలు జరిపారు. ఆబ్‌కీ బార్.. కిసాన్ సర్కార్‌‌ నినాదంతో ముందుకెళ్లాలని భావిస్తున్న కేసీఆర్ .. కిసాన్‌ యాత్రలతో రైతులను ఏకతాటిపైకి తేవాలని భావిస్తున్నట్టుగా గులాబీ పార్టీ వర్గాలు తెలిపాయి. 

Also Read: ఢిల్లీ వేదికగానే బీఆర్ఎస్ విస్తరణ వ్యుహాలు.. ప్రతి నెల వారం రోజులు కేసీఆర్ అక్కడే..!

అంతేకాకుండా.. ప్రతి నెల ఒక వారం రోజుల పాటు ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం‌ నుంచే పనిచేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే నెల నుంచే ఈ విధమైన ప్రణాళికను అమలు చేయనున్నట్టుగా సమాచారం. పార్టీ ఎంపీలు, రైతు నేతలతో సమావేశమైన సందర్భంగా కేసీఆర్ తన ప్రణాళికలపై చర్చించారని గులాబీ పార్టీ వర్గాలు తెలిపాయి. మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత నెలకు రెండు వారాల పాటు కేసీఆర్ ఢిల్లీలో ఉండనున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఐదు నెలల తేడా ఉన్నందున.. రెండు ఎన్నికలపై దృష్టి సారించేందుకు ఇటు హైదరాబాద్, అటు ఢిల్లీలో అందుబాబులో ఉండేలా షెడ్యూల్‌ను రూపొందించుకోనున్నారు. 

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ స్థానంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్‌ను(ఓపీఎస్‌) తిరిగి తీసుకురావడాన్ని పరిశీలిస్తామని.. అన్ని రాష్ట్రాల్లో ఓపీఎస్ అమలుపై బీఆర్‌ఎస్ జాతీయ విధానాన్ని ప్రకటిస్తామని ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో తనను కలిసిన కొందరు ఉద్యోగులకు కేసీఆర్ చెప్పినట్టుగా  తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఓపీఎస్‌ను తిరిగి తీసుకువస్తామన్న కాంగ్రెస్ వాగ్దానం అక్కడ ఆ పార్టీ విజయానికి దారితీసిందని విశ్లేషణల నేపథ్యంలో కేసీఆర్ ఈ విధమైన భావనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే ప్రణాళికల్లో భాగంగా.. కిసాన్ యాత్రలతో రైతులను ఆకర్షించాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. తొలుత మహారాష్ట్రలోని  విదర్భ నుంచి ఈ యాత్రలు మొదలుపెట్టి.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా నిర్వహించాలని కేసీఆర్ ఆలోచినట్టుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి.  అలాగే కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపుల పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు.. ఈ విషయంలో బీఆర్ఎస్ వైఖరి స్పష్టంగా ఉందని, రైతులకు భరోసా కల్పించేలా పనిచేస్తుందని రైతు సంఘాల నాయకులకు కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది

Follow Us:
Download App:
  • android
  • ios