హైదరాబాద్: ప్రేమించి మోసం చేశాడని  ఫిర్యాదు చేసిన యువతిపై  పోలీసుల ముందే యువకుడు దాడికి దిగాడు. ఈ ఘటన హైద్రాబాద్ లోని మానవ హక్కుల కార్యాలయం ఆవరణలో గురువారం నాడు చోటు చేసుకొంది.

కవిత  అనే యువతి తనను ప్రేమించి మోసం చేశాడని ఆశోక్ అనే యువకుడిపై మానవహక్కుల కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.ఈ సమయంలో తనను ప్రేమ పేరుతో వాడుకొని ఎందుకు మోసం చేశావని బాధితురాలు ప్రశ్నించింది. ఆశోక్ ను ఈ విషయమై నిలదీసింది. దీంతో ఆగ్రహంతో ఆశోక్ ఆమెపై దాడికి దిగాడు. 

ప్రేమించి తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. ఆశోక్ తన ఇంటికి పిలిచి దాడికి దిగారని ఆమె ఆరోపించారు.తనకు పోలీసుల నుండి న్యాయం జరగకపోవడంతోనే మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించినట్టుగా ఆమె చెప్పారు.

తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరింది. ఇదే విషయమై ఆమె హెచ్ఆర్ సీ లో ఫిర్యాదు చేసింది.