ఆషాడం ఆఫర్... రూ.10కే చీర

First Published 18, Jul 2018, 9:46 AM IST
ashadam sale.. saree for rs.10 in hanmakonda
Highlights

కిక్కిరిసిన షాపింగ్ మాల్.. వేల సంఖ్యలో తరలివచ్చిన మహిళలు

ఆషాడమాసం వచ్చిందంటే చాలు.. షాపింగ్ మాల్స్ జనాలతో నిండిపోతాయి. ఎందుకంటే.. ఎప్పుడూ ప్రకటించనన్ని ఆఫర్లు.. కేవలం ఆషాడమాసంలోనే ప్రకటిస్తారు. ముఖ్యంగా బట్టలు, బంగారంపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తారు. దీంతో మహిళలు.. ఎగబడి కొనుగోలు చేస్తూ ఉంటారు.

40శాతం, 50శాతం ఆఫర్లు ప్రకటిస్తేనే షాపింగ్ మాల్స్ ఖాళీగా ఉండని రోజులివి. అలాంటిది ఏకంగా రూ.10కే చీర అందిస్తే ఎలా ఉంటుంది. హన్మకొండలో ఓ వస్త్ర దుకాణ యజమాని ఇదే ఆఫర్ ప్రకటించాడు.

ఇంకేముంది.. హన్మకొండతోపాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా మహిళలు తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు కూడా తరలిరావాల్సి వచ్చింది. 

ఉదయం పది నుంచి 12 గంటల మధ్య ఆఫర్ చీరలు అమ్మకానికి పెట్టినట్లు మాల్ ఓనర్ తెలిపారు. మొదట చీరలను ఫ్రీగా ఇద్దామని అనుకున్నామని అయితే ఆఫర్ ప్రకటించాలనే ఉద్దేశ్యంతోటే పది రూపాయల ధర నిర్ణయించినట్లు వివరించారు. పెద్ద సంఖ్యలో కస్టమర్స్‌ వచ్చినప్పుడు ఇతర ఐటమ్స్ కూడా కొనే అవకాశం ఉందని అలాగే తమ షాపింగ్ మాల్‌ గురించి అందరికీ తెలుస్తుందని యజమాని చెప్పుకొచ్చారు. 

loader