Asianet News TeluguAsianet News Telugu

ఉగ్రవాదుల ఉరిపై ఓవైసీ ఆగ్రహం

  • ఎన్ ఐ ఏ ది ద్వంద్వ వైఖరని ధ్వజం
Asaduddin questions NIA over terror cases probe

 

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ ఐ ఏ పై కోపం వచ్చింది.

 

దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేలుళ్ల కేసు దర్యాప్తును వేగంగా దర్యాప్తు చేసి నిందితులకు ఉరి వేయించిన

 

ఎన్ ఐ ఏ దేశంలోని మిగతా కేసులను ఎందుకు అంత వేగంగా దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు.

 

మక్కామసీద్, అజ్మీర్ దర్గా, మాలేగావ్ పేలుళ్ల దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. వీటి కేసులను కూడా ఎన్ ఐ ఏ నే దర్యాప్తు చేస్తోందని గుర్తు చేశారు.

 

దిల్‌సుఖ్‌నగర్‌ కేసులో మూడేళ్లలో తీర్పు వచ్చేంది, మిగతా కేసుల్లో మాత్రం ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇది ఎన్ ఐ ఏ ద్వంద్వ వైఖరికి నిరదర్శనమన్నారు.

 

1992లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం పై ఇప్పటికీ దర్యాప్తు జరుపుతూనే ఉన్నారు ఎద్దేవా చేశారు.

 

నిందితులు ముస్లిమేతరులు అయితే దర్యాప్తు నత్తనడకన సాగుతోందని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios