Asianet News TeluguAsianet News Telugu

కరోనా పరీక్షలు చేపించుకున్న ఒవైసి, ప్రజలకు విన్నపం

రాపిడ్ యాంటిజెన్ టెస్టు ద్వారా ఫలితాలు అరగంటలోనే వస్తున్నాయని, తనకు నెగటివ్ వచ్చిందని అసదుద్దీన్ వెల్లడించారు. ఆ తరువాత ఆర్టీపీసీఆర్ టెస్టు చేపించుకున్నానని, అది కూడా నెగటివ్ వచ్చిందని తెలిపారు. 

Asaduddin Owaisi Gets Tested For Coronavirus, Requests Hyderabadis To Come Forward
Author
Hyderabad, First Published Jul 11, 2020, 5:00 PM IST

హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ నేత ఆస్దదుద్దిన్ ఒవైసి కరోనా పరీక్షలు చేపించుకున్నారు. కరోనా పరీక్షలు చేపించుకున్నానని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాపిడ్ యాంటిజెన్ టెస్టు ద్వారా ఫలితాలు అరగంటలోనే వస్తున్నాయని, తనకు నెగటివ్ వచ్చిందని అసదుద్దీన్ వెల్లడించారు. ఆ తరువాత ఆర్టీపీసీఆర్ టెస్టు చేపించుకున్నానని, అది కూడా నెగటివ్ వచ్చిందని తెలిపారు. 

ఆయన టెస్ట్ చేపించుకోవడంతోపాటుగా అందరిని లక్షణాలు ఉంటె టెస్టులు చేపించుకోవడానికి ముందుకురావాలని కోరారు. దక్షణ హైదరాబాద్ లో 30 సెంటర్లలో టెస్టులు చేస్తున్నారని. గతంలో హైదరాబాద్ పరిధిలో కరోనా టెస్టులను ఎక్కువగా చేయాలని అసదుద్దీన్ కోరిన విషయం అందరికి తెలిసిందే. 

తెలంగాణాలో టెస్టులను పెంచిన నేపథ్యంలో రాపిడ్ యాంటిజెన్ టెస్టులను ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టుల్లో కరోనా లక్షణాలుండి నెగటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ టెస్టు చేపించుకోవాలి. అదే పాజిటివ్ వస్తే అవసరం లేదు. 

ఇకపోతే... తెలంగాణలో గడిచిన కొద్దిరోజుల నుంచి ఉగ్రరూపం చూపుతున్న కరోనా వైరస్ కాస్త కూడా దయ చూపడం లేదు. తాజాగా శుక్రవారం 1,278 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,224కు చేరింది. ఇవాళ 8 మంది మరణించడంతో... మొత్తం మృతుల సంఖ్య 339కి చేరుకుంది. ఇవాళ ఒక్క హైదరాబాద్‌లోనే 762 మందికి పాజిటివ్‌గా తేలింది.

ఆ తర్వాత రంగారెడ్డి 171, మేడ్చల్ 85, సంగారెడ్డి 36, ఖమ్మం 18, కామారెడ్డి 23, మెదక్ 22, నల్గొండ 32, ఆదిలాబాద్ 14, సూర్యాపేట 14, నారాయణ పేట 9, నిజామాబాద్‌‌లలో 8 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 12,680 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 19,205 మంది కోలుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios