Asianet News TeluguAsianet News Telugu

జాతీయ పార్టీగా టీఆర్ఎస్.. కేసీఆర్‌కు అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు..

టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. 

asaduddin owaisi congratulate KCR on TRS transformation into a national party.
Author
First Published Oct 5, 2022, 2:11 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్.. ఇకపై భారత్ రాష్ట్ర సమితిగా మారనుంది. ఇక, తెలంగాణ భవన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పేరు మార్పు, ఎజెండాను కేసీఆర్.. పార్టీ నేతలకు కేసీఆర్ వివరించారు. ఈ సమావేశంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, వీసీకే చీఫ్ తిరుమలవలన్ కూడా పాల్గొన్నారు. పార్టీ పేరును మారుస్తూ కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత వారు శుభాకాంక్షలు చెప్పారు. 

టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. కొత్తగా ప్రారంభమైన పార్టీకి తన శుభాకాంక్షలు తెలియజేశారు. 

 


Also Read: టీఆర్ఎస్ ఇక నుండి బీఆర్ఎస్: విస్తృత స్థాయి సమావేశం తీర్మాణం

ఇక, ఈ రోజు తెలంగాణ భవన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో..  పార్టీ రాజ్యాంగానికి అవసరమైన సవరణలు కూడా చేశారు. పార్టీ పేరు మార్పు, పార్టీ రాజ్యాంగంలో చేసిన సవరణలతో కూడిన తీర్మానాన్ని.. పార్టీ ప్రతినిధి బృందం భారత ఎన్నికల సంఘానికి సమర్పించనుంది. పార్టీ పేరును మార్చాలని.. జాతీయ పార్టీగా నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తును కూడా సమర్పించనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios